AP Curfew: ఏపీలో కర్ఫ్యూ మరింత కఠినం

E Pass is Necessary to Cross the Andhra Pradesh From Today
x
ఈ పాస్ 
Highlights

AP Curfew: ఇవాళ్టి నుంచి ఏపీ దాటాలంటే ఈ- పాస్ తప్పనిసరి * ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ రిపోర్ట్‌ చూపించాల్సిందే

AP Curfew: ఏపీలో కరోనా మహమ్మారి కట్టడికి విధించిన కర్ఫ్యూ మరింత కఠినం కానుంది. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈపాస్ విధానం మరోసారి తెరపైకి వచ్చింది. ఏపీలోలో కర్ఫ్యూ అమలులో ఉన్న సమయంలో అత్యవసరంగా ప్రయాణించాలనుకొనే వారికోసం ఈ-పాస్‌ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్టు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు. ఇవాళ్టి నుంచి ఈ విధానం అందుబాటులోకి వస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో కర్ఫ్యూ అమలు తీరును, పోలీసు కంట్రోల్‌ రూమ్‌ వద్ద పరిస్థితులను పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించే వారికోసం ఈపాస్‌ విధానాన్ని అమలులోకి తీసుకొస్తున్నప్పటికీ, అంతర్రాష్ట్ర రాకపోకలపై ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ప్రస్తుతం ఉన్న షరతులు వర్తిస్తాయని చెప్పారు.

కరోనా తీవ్రత, కేసుల పెరుగుదల దృష్ట్యా రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు అనుమతులు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. శుభకార్యాలకు సంబంధించి మాత్రమే ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం అనుమతులు ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో న్యాయం కోసం బాధితులు పోలీస్‌స్టేషన్ల వరకు రావాల్సిన అవసరం లేదని, ఏపీ పోలీస్‌ సేవా యాప్‌లోనే ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని డీజీపీ హెచ్చరించారు. కరోనాకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories