Dwcra Women: డ్వాక్రా మహిళలకు శుభవార్త.. రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు

Dwakra for women in AP increased from Rs 2 lakh to Rs 5 lakh
x

Dwcra Women : డ్వాక్రా మహిళలకు శుభవార్త..రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు

Highlights

Dwcra Women:ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ అందించింది. ఎస్సీ, ఎస్టీ, డ్వాక్రా మహిళలకు రుణ పరిమితిని రూ. 2లక్షల నుంచి రూ. 5లక్షల వరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. కనిష్టంగా రూ. 50వేల నుంచి రూ. 5లక్షల వరకు వడ్డీలేని రుణాలను డ్వాక్రా మహిళలకు అందిస్తారు.

Dwcra Women: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ అందించింది. ఎస్సీ, ఎస్టీ, డ్వాక్రా మహిళలకు రుణ పరిమితిని రూ. 2లక్షల నుంచి రూ. 5లక్షల వరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. కనిష్టంగా రూ. 50వేల నుంచి రూ. 5లక్షల వరకు వడ్డీలేని రుణాలను డ్వాక్రా మహిళలకు అందిస్తారు. డ్వాక్రా మహిళలకు ఈ రుణాన్ని వాయిదా రూపంలో తిరిగి చెల్లిస్తారు. 2024-25 ఏడాదికి సంబంధించి రూ. 250కోట్లు రుణంగా ఇవ్వాలని అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు.

ఇప్పటికే ఈ ఫైల్ పై ఎమ్ఎస్ఎమ్ఈ , సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంతకం చేశారు. ఈ ఉన్నతి పథకం కింద రుణం మంజూరుకు ప్రణాళికలు అమలు చేస్తున్నారు. డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ మహిళలు ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న నెలలో యూనిట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో గ్రామసంఘం స్థాయి నుంచి అన్ని దశల్లోనూ పర్యవేక్షణ ఉంటుంది. అలాగే లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న జీవనోపాధికి అనుగుణంగా రుణం మంజూరుచేయనున్నారు. ఏ జీవనోపాధి ఏర్పాటు చేసుకోవాలనేది డ్వాక్రా మహిళల ఇష్టంపై ఆధారపడి ఉంటుంది.

మొన్నటి వరకు ఉన్నతి పథకం కింద రుణాల మంజూరును గ్రుహనిర్మాణానికి, విద్యకు, భూమి కొనుగోలుకు వర్తించదు. డ్వాక్రా మహిళల నుంచి వచ్చిన విజ్నప్తులతో విద్య, ఇంటినిర్మాణానికి భూమి కొనుగోలుకు కూడా వర్తింపచేయాలని అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. ఎస్సీ కార్పొరేషన్ నుంచి రూ. 8కోట్ల మేర నిధులను రాయితీ కింద డ్వాక్రా మహిళలకు అందించే అవకాశం ఉంది. ఒక్కో మహిళకు గరిష్టంగా రూ. 50వేల వరకు రాయితీ కింద రుణం అందిస్తారు. ప్రభుత్వం ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఈ పథకం డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ, ఎస్టీ మహిళల అభ్యున్నతి కోసం తీసుకువచ్చిన పథకం. మహిళలు ఈ రుణాలు తీసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అభివ్రుద్ధి సాధించేలా చూడాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం రుణ పరిమితిని రూ. 5లక్షల వరకు పెంచడంతో వారికి మరింత ఊరట లభించింది. ఏపీలో కొత్త సర్కార్ అధికారంలోకి రావడంతో బడ్జెట్ నుంచి మరో రూ. 250కోట్ల నిధులకు ప్రతిపాదనలు పంపించారు. ప్రస్తుతం ఉన్న రూ. 250కోట్ల నిధులకు అదనంగా చేరితే రూ. 500కోట్ల మేర రుణాలు, ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఒక్క ఏడాదిలోనే అందించే ఛాన్స్ ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories