Madhuri: 'శ్రీనివాస్‌తోనే ఉంటా'.. దువ్వాడ ఇంటి ముందు కొనసాగుతున్న హైడ్రామా

Duvvada Srinivas Family Controversy
x

Madhuri: దువ్వాడ శ్రీనివాస్‌తోనే ఉంటా.. దువ్వాడ ఇంటి ముందు కొనసాగుతున్న హైడ్రామా

Highlights

Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. నిన్న రాత్రి దువ్వాడ శ్రీను ఇంటి వద్ద గలాటా జరిగింది.

Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. నిన్న రాత్రి దువ్వాడ శ్రీను ఇంటి వద్ద గలాటా జరిగింది. దువ్వాడ శ్రీనివాస్‌ను కలుసుకునేందుకు ఫ్యామిలీ వస్తే ఉద్రిక్తత నెలకొంది. గురువారం సాయంత్రం దువ్వాడను కలిసేందుకు ఇద్దరు కుమార్తెలు మాత్రమే వచ్చారు. నిన్న సాయంత్రం మాత్రం కుమార్తెలతో కలిసి తల్లి వాణి కూడా వచ్చారు. ఆయన ఎప్పటికీ బయటకు రాకపోవడంతో తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో కాసేపు ఉద్రిక్తతకు దారి తీసింది. అక్కడ గందరగోళం నెలకొనడంతో ఎట్టకేలకు దువ్వాడ శ్రీనివాస్ బయటకు వచ్చి ఫ్యామిలీపై చిందులు తొక్కారు.

సాయంత్రం వచ్చిన దువ్వాడ ఫ్యామిలి అర్థరాత్రి వరకు అక్కడే ఉండిపోయింది. ఎలాగైనా సరి దువ్వాడ శ్రీనివాస్‌ను కలిసే వెళ్తామని చెప్పి భీష్మించుకొని కూర్చున్నారు. చివరకు బయటకు వచ్చిన దువ్వాడ శ్రీను వారిపై కేకలు వేస్తూ విమర్సలు చేశారు. వారితో వాగ్వాదానికి దిగారు. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి, కుమార్తెలు హైందవీ, నవీనతో కలిసి కాకుండా మరో మహిళ దివ్వెల మాధురితో కొంతకాలంగా కలిసి ఉంటున్నారు. ఈ విషయం పబ్లిక్ కావడంతో ఎమ్మెల్సీ కూతుళ్లు తమ తండ్రిని తమకు కాకుండా దూరం చేస్తోందని.. అతడ్ని కలిసి మాట్లాడేందుకు వెళ్లారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ భద్రత సిబ్బంది అనుమతించకపోవడంతో విషయాన్ని బయటపెట్టారు.

తన భర్త దువ్వాడ శ్రీనివాస్‌తో ఉండాలని కోరుకోవడం లేదని దువ్వాడ వాణి స్పష్టం చేశారు. ఆయన వల్ల తన కుటుంబం పరువు పోతుందని అన్నారు. దువ్వాడ శ్రీనివాస్‌ టెక్కలి వదిలివెళ్లాలని డిమాండ్‌ చేశారు. దువ్వాడ శ్రీనివాస్‌ వల్ల తనకేమీ ఆస్తులు రాలేదని స్పష్టం చేశారు. చొక్కా లుంగీతో వచ్చిన శ్రీనివాస్‌కు ఎలాంటి ఆస్తులు లేవని వెల్లడించారు. ఆయన రాజకీయాలతో తామే ఎక్కువగా నష్టపోయామని తెలిపారు.

ఓ వైపు దువ్వాడ శ్రీనివాస్ తో ఇకపై కలిసి ఉండనని భార్య వాణి తెగేసి చెబితే... మరో వైపు దివ్వెల మాధురి మాత్రం ఇంత జరిగిన తర్వాత శ్రీనివాస్‌తోనే ఉంటానని అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories