Andhra Pradesh: పచ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వైద్యుడి నిర్వాకం

Doctor Fraud in Eluru East Godavari District
x

Representational Image

Highlights

Andhra Pradesh: కొవిడ్‌ భయంతో వచ్చిన యువకుడికి వికటించిన వైద్యం

Andhra Pradesh: గత ఏడాది ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా ఆ యువకుడి జీవితాన్ని మాత్రం చిన్నాభిన్నం చేసింది. కొందరి ప్రాణాలు తీసిన ఆ డెడ్లీ వైరస్‌ తనను బ్రతికుండగానే జీవచ్చవాన్ని చేసింది. వృద్ధులైన తన తల్లిదండ్రులకు అండగా ఉండాల్సిన ఆ యువకుడు ఇప్పుడు అదే తల్లిదండ్రులు సాయం అందిస్తేనేగానీ లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. వీల్‌చైర్‌కి పరిమితమయ్యాడు.

తనలో కరోనా లక్షణాలు ఉండడంతో వైరస్‌ సోకిందనే భయానికి లోనయ్యాడు యువకుడు కృపాకాంత్‌. దీంతో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిని ఆశ్రయించాడు. అయితే అతడికి కరోనా నెగెటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని బాధితుడికి చెప్పని ఓ వైద్యుడు అతడి భయాన్ని క్యాష్‌ చేసుకోవాలనుకున్నాడు. దారుణానికి ఒడిగట్టాడు. వైద్యం వికటించేలా చేశాడు. కట్‌ చేస్తే ఆ యువకుడు తన రెండు కాళ్లను కోల్పోయాడు.

విజయవాడలో మరో ప్రైవేటు ఆస్పత్రిలో చేరడంతో కాళ్లకు ఇన్‌ఫెక్షన్‌ వచ్చినట్టు వారు చెప్పారు. కొవిడ్‌ సోకకుండా వాడే స్టెరాయిడ్‌ ఇంజక్షన్స్‌ ఎక్కువగా తీసుకోవడంతో అతని శరీరానికి ఎలాంటి మెడిసిన్స్‌ ఇచ్చినా అవి పనిచేయడంలేదని వైద్యులు అంటున్నారు. అవసరమైన అన్ని పరీక్షలు, స్కానింగ్‌లు చేశామని చెప్పారు.

వైద్యుడి నిర్వాకం వల్లే కాళ్లను కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు బాధితుడు కృపాకాంత్. 7 నెలలుగా మంచానికే పరిమితయ్యానని, అధికారులు, పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాను పడుతున్న మానసిక క్షోభ వేరెవరూ పడొద్దనే ఉద్దేశంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆన్‌లైన్‌లో ఆశ్రయించాడు. యువకుడి ఫిర్యాదును స్వీకరించిన కమిషన్‌ కేసు నమోదు చేసి రెండు నెలల్లో సంబంధిత వైద్యుడిని విచారించి నివేదిక ఇవ్వాలని వైద్యారోగ్యశాఖ కార్యదర్శిని ఆదేశించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories