Chandrababu: చంద్రబాబుపై మరో కేసు.. పీటీ వారెంట్ దాఖలు చేసిన సీఐడీ

Discussion In AP On PT Warrant In Chandrababu Case
x

Chandrababu: చంద్రబాబుపై మరో కేసు.. పీటీ వారెంట్ దాఖలు చేసిన సీఐడీ

Highlights

Chandrababu: 40, 41 లా కమిషన్ ఆధారంగా సెక్షన్ 269 CRPCలో వారెంట్ జారీ

Chandrababu: పీటీ వారెంట్.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్. టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్‌పై జోరుగా చర్చ జరుగుతోంది. ఫైబర్ నెట్ స్కామ్‌లో అవినీతి జరిగిందంటూ సీఐడీ అధికారులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. అసలు పీటీ వారెంట్‌ అంటే ఏమిటి.. ఎప్పుడు జారీ చేస్తారో తెలుసుకుందాం.

ప్రిజన్ ట్రాన్సిట్ వారెంట్ దీనినే పీటీ వారెంట్ అంటారు. నిందితుడు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ నేరాల్లో భాగస్వామి అయితే ఈ రకమైన పిటిషన్ కోర్టులో వేస్తారు. ఒక కేసులో అరెస్ట్ అయి ఉన్న వ్యక్తికి తాను చేసిన అన్ని తప్పులకు సంబంధించి, రకరకాల కోర్టులకు హాజరు పరచడానికి వేసే వారెంటునే పీటీ వారెంట్ అంటారు. దీనిని 40, 41 లా కమిషన్ ఆధారంగా చేసుకొని సెక్షన్ 269 CRPCలో పొందుపర్చారు.

ఇప్పటికే జైలులో ఉన్న ఖైదీని మరో కేసులో విచారణ కోసం ప్రిజన్ ట్రాన్సిట్ వారెంట్ కింద జైలు నుంచి ఇంకో ప్రాంతానికి తరలించేలా కోర్టు అనుమతి కోరతారు. అప్పుడు కోర్టు పీటీ వారెంట్ ఇస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే జైలులో ఉన్న ఖైదీని మరో చోటికి తరలించడం. సీఆర్పీసీలోని సెక్షన్ 267 కింద కోర్టు పీటీ వారెంట్‌ని ఇస్తుంది.

చంద్రబాబును ఇప్పటికే ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ వ్యవహారంలోనే ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచారు. అయితే ఈ కేసు నిమిత్తం సీఐడీ విచారణ కోరుతూ 5 రోజుల కస్టడీ కోరుతూ పిటీషన్ దాఖలు చేసింది. దీనికి చంద్రబాబు తరఫు న్యాయవాదులు కౌంటర్ కూడా దాఖలు చేశారు. అందులో భాగంగానే ఏపీ సీఐడీ మరింత దూకుడు పెంచింది. ఈ క్రమంలో చంద్రబాబును ఇప్పటి వరకూ పెండింగ్‌లో ఉన్నవే కాకుండా అవినీతి అక్రమాలకు పాల్పడిన వాటన్నింటినీ వెలికితీసే ప్రయత్నంలో భాగంగా పీటీ వారెంట్ దాఖలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories