Tirumala: శ్రీవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు

Devotees Came In Large Numbers To See Lord
x

Tirumala: శ్రీవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు

Highlights

Tirumala: భక్తులతో రద్దీగా మారిన తిరుమల కొండ

Tirumala: తిరుమల కొండ.. భక్తులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవులకు తోడు వీకెండ్ కూడా కలిసి రావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లతో పాటు రింగ్ రోడ్ లోని మూడు కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేసి ఉన్నారు. మరోవైపు మధ్యాహ్నం నుంచి తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో వెలుపల క్యూ లైన్ లో ఉన్న భక్తులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు‌‌. స్వామివారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు వచ్చే భక్తులు.. తలదాచుకునేందుకు తాత్కాలిక షెడ్ల వైపు పరుగులు తీశారు. వర్షంతో తిరుమలలో ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఘాట్ రోడ్డులో ప్రయాణికులు జాగ్రత్తగా వెళ్లాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories