Cyclone Fengal News: ఫేంజల్ తుపాన్ ప్రభావంతో దంచి కొడుతున్న వర్షాలు.. నిండుకుండలా రిజర్వాయర్లు

Cyclone Fengal News: ఫేంజల్ తుపాన్ ప్రభావంతో దంచి కొడుతున్న వర్షాలు.. నిండుకుండలా రిజర్వాయర్లు
x
Highlights

Cyclone Fengal News Updates: బంగాళాఖాతంలో అలజడి సృష్టించిన ఫేంజల్ తుపాను శనివారం అర్ధరాత్రి దాటాక తమిళనాడులోని కరైకల్, మహాబలిపురం మధ్యలో తీరం దాటింది....

Cyclone Fengal News Updates: బంగాళాఖాతంలో అలజడి సృష్టించిన ఫేంజల్ తుపాను శనివారం అర్ధరాత్రి దాటాక తమిళనాడులోని కరైకల్, మహాబలిపురం మధ్యలో తీరం దాటింది. అయినప్పటికీ తుపాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల ఆదివారం కూడా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఈ తుపాన్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. మిగతా చోట్ల కూడా సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

నెల్లూరు జిల్లాలో ఫేంజల్ ఎఫెక్ట్

నెల్లూరు జిల్లాపై ఫేంజల్ తుపాన్ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. శనివారం రాత్రి నుండి జిల్లాలోని అనేక చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా ఇందుకూరుపేట, విడవలూరు,కొడవలూరు, ముత్తుకూరు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అనేక చోట్ల చెట్లు, చెట్ల కొమ్మలు విరిగి రోడ్లకు అడ్డంగా పడ్డాయి.

తిరుమల కొండల మధ్య నిండు కుండలా రిజర్వాయర్లు

తిరుమల కొండల మధ్య ఉన్న గోగర్భం, పసుపుధార, కుమారధార, ఆకాశగంగ, పాపవినాశనం జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. ఇప్పటికే గోగర్భం రిజర్వాయర్ నుండి 2 గేట్లు ఎత్తి నీరును దిగువకు వదిలిపెడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories