కర్నూలు ఎంపీకి సైబర్ వల.. రూ. 97,699 కాజేసిన సైబర్ మోసగాడు...

Cyber Fraud Trapped Kurnool MP Dr Sanjeev Kumar took 97699 | Cyber Crime Latest News
x

కర్నూలు ఎంపీకి సైబర్ వల.. రూ. 97,699 కాజేసిన సైబర్ మోసగాడు...

Highlights

Kurnool: *పాన్ నెంబర్ తో అప్డేట్ చేసుకోవాలంటూ వల *బ్యాంక్ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నట్టు చెప్పిన మోసగాడు

Kurnool: సైబర్ మోసగాళ్ల మాయాజాలంలో అమాయకులు మాత్రమే కాదు.. సామాన్యుల్ని అలర్ట్ చేసే ప్రజాప్రతినిధులు సైతం చిక్కుతున్నారు. తాజాగా కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ ఖాతా నుంచి రెండు విడతలుగా దాదాపు లక్ష రూపాయలు కాజేశారు. బ్యాంకు అకౌంట్ బ్లాక్ అయిందని, వెంటనే పాన్ నంబరుతో జత చేసి అప్డేట్ చేసుకోవాలంటూ సోమవారం ఓ మొబైల్ నంబరు నుంచి సంజీవ్ కుమార్ సెల్ ఫోన్ కు మెసేజ్ తో పాటు ఓ లింకు కూడా వచ్చింది.

ఆ సమాచారం నమ్మిన ఎంపీ.. ఆ లింకులో అన్ని వివరాలూ నమోదు చేసి పంపారు. అప్పుడు ఓటీపీ నంబర్లు కూడా వచ్చాయి. ఆ తర్వాత అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంకు కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నట్లు పరిచయం చేసుకున్నాడు. ఖాతా ఇతరత్రా వివరాలు, ఓటీపీ నం-బర్లు అడిగి తెలుసుకున్నాడు. ఆ వివరాలన్నీ చెప్పిన వెంటనే ఎంపీ అకౌంట్ నుంచి 48 వేల 700 రూపాయలు ఒకసారి, 48వేల 999 రూపాయలు మరోసారి డ్రా అయినట్లు సెల్ ఫోన్ కు మెసేజ్ లు వచ్చాయి.

అప్పుడు అనుమానం వచ్చిన ఎంపీ బ్యాంకుకు ఫోన్ చేయగా అసలు విషయం బయటపడింది. సైబర్ నేరగాడు తనను మోసగించి మొత్తం 97 వేల 699 కాజేసినట్లు ఎంపీ సంజీవ్ కుమార్ గుర్తించారు. వెంటనే అదే రాత్రి కర్నూలు టూటౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories