Curfew Timing in AP: కర్ఫ్యూ సమయంలో ఎలాంటి మార్పులు చేయలేదని ఏపీ సర్కార్ క్లారిటీ ఇచ్చింది.
Curfew Timing in AP: కర్ఫ్యూ సమయంలో ఎలాంటి మార్పులు చేయలేదని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని ఏపీ సర్కార్ హెచ్చరించింది. కట్టడి చేయడానికి ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ కర్ఫ్యూ విషయానికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఈ నెల 20 నుంచి కర్ఫ్యూ సమయాల్లో మార్పులు జరగనున్నాయని... ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుందనేదే ఆ సమాచారం. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని ప్రకటించింది.
కర్ఫ్యూ సమయాల్లో ఎలాంటి నిజం లేదని ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడు ఉన్న మాదిరిగానే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ సడలింపులు ఉంటాయని చెప్పింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఇలాంటి తప్పుడు కథనాలను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
There is no change in the daily relaxation period of 6:00 am till 12:00 noon in the extended curfew till 31st May 2021.
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) May 18, 2021
The malicious message circulating on whatsapp claiming a change in daily relaxation period from 20th may is false.
Full story: https://t.co/n5564Y2e8h pic.twitter.com/P6TmYB7Yaz
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire