AP Curfew 2021: ఏపీలో క‌ర్ఫ్యూ పొడిగింపు

Andhra Pradesh: Curfew Extended Till June 20
x

జగన్(ఫైల్ ఇమేజ్ )

Highlights

AP Curfew 2021: ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉన్న కర్ఫ్యూను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

AP Curfew 2021: ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూను పొడగిస్తూ రాష‌్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్‌ 20 వరకు కర్ఫ్యూను పొడిగించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గుతున్నా.. పూర్తిగా అదుపులోకి రాలేదు. 10న కర్ఫ్యూ గడువు పూర్తి కానుండడంతో రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, కర్ఫ్యూ అమలుపై అధికారులతో నేడు సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కేసులు మరింత తగ్గే వరకు కర్ఫ్యూ కొనసాగించడమే మంచిదని సమావేశంలో నిర్ణయించారు.

క‌ర్ఫ్యూను ఈ నెల 20 వ‌ర‌కు పొడిగించిన ప్ర‌భుత్వం.. స‌డ‌లింపు స‌మ‌యాన్ని కూడా పెంచింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉద‌యం ఆరు నుంచి మధ్యాహ్నం 12 వ‌ర‌కు ఉన్న స‌డ‌లింపు స‌మయం.. ఈ నెల 11 నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు. 10వ తేదీ వ‌ర‌కు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. 11 తేదీ నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్లను అనుమతించ‌నున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories