Bhadrachalam: హనుమాన్ జయంతి సందర్భంగా భద్రాచలంలో భక్తుల రద్దీ

Crowd Of Devotees In Bhadrachalam On The Occasion Of Hanuman Jayanthi
x

Bhadrachalam: హనుమాన్ జయంతి సందర్భంగా భద్రాచలంలో భక్తుల రద్దీ

Highlights

Bhadrachalam: పలు ప్రాంతాల నుంచి దీక్ష విరమణకు విచ్చేసిన వేలాది మంది భక్తులు

Bhadrachalam: హనుమాన్ జయంతి సందర్భంగా భద్రాచలం భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి దీక్ష విరమణకు విచ్చేసిన కొన్ని వేలమంది హనుమాన్ భక్తులు ఇవాళ తెల్లవారుజాము నుంచే ఆలయంలో దర్శనం కోసం క్యూలైన్‌‌లో భక్తులు బారులు తీరారు. శ్రీరామనవమి అనంతరం శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, వైభవంగా నిర్వహించబడే పండుగగా హనుమాన్ జయంతిని భావిస్తారు.

పలు ప్రాంతాల నుంచి భద్రాచలానికి విచ్చేసిన హనుమాన్ భక్తులు పవిత్ర గోదావరి నది తీరంలో స్నానాలు ఆచరించి, కరకట్ట మీద ఉన్న హనుమాన్ టెంపుల్‌లో దీక్ష విరమణ చేసిన అనంతరం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని భక్తి పారవశ్యమవుతున్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను ఆలయాధికారులు సిద్ధం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories