పల్లెలకు విస్తరిస్తున్న క్రికెట్ బెట్టింగ్, ఇంటినే బెట్టింగ్ కేంద్రంగా మార్చిన సర్పంచ్...

Cricket Bettings at East Godavari Jaggampet Rajapudi Sarpanch Home | Telugu Online News
x

పల్లెలకు విస్తరిస్తున్న క్రికెట్ బెట్టింగ్, ఇంటినే బెట్టింగ్ కేంద్రంగా మార్చిన సర్పంచ్...

Highlights

Cricket Betting - East Godavari: రూ.1.26 లక్షలు, 2 ల్యాప్‌టాప్‌లు, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం...

Cricket Betting - East Godavari: తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల బెట్టింగ్ సంస్కృతి విపరీతంగా పెరిగింది. జిల్లాలోని రాజమండ్రి, కాకినాడ, అమలాపురం సహా ఇతర పట్టణాల్లో జరిగే ఈ తంతు ఇప్పుడు పల్లెలను పట్టి కుదిపేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కొందరు యువత ఈజీ మని కోసం బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. క్రికెట్ బుక్కీల మాటల మయాజాలానికి ఫిదా అయిపోతున్నారు. ఫలితంగా లక్షల్లో సొమ్మును పోగోట్టుకుంటున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోన్న పంటర్లు, బుక్కీలు.. నిర్జన ప్రదేశాలను వారి అడ్డగా చేసుకుని బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు.

జగ్గంపేట మండలం రాజపూడిలో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ఇందులో నిర్ఘాంతపోయే విషయాలు వెలుగు చూశాయి. ఇటీవల గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన వ్యక్తి క్రికెట్ బుక్కీగా అవతారం ఎత్తినట్టు గుర్తించారు. అధికార వైసిపికి చెందిన యువ సర్పంచ్ బూసాల విష్ణు బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు పోలీసులు వలపన్నారు. బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహించేందుకు తన ఇంటినే డెన్‌గా మార్చిన విష్ణు ఇంటిపై ఇటీవల పెద్దాపురం డిఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు, జగ్గంపేట సిఐ సురేష్ బాబు సహా ఇతర పోలీసు అధికారులు దాడి చేశారు.

అయితే తన ఇంటికి వచ్చిన పోలీసులపై సర్పంచ్ విష్ణు దాడికి పాల్పడి పరారయ్యాడు. అక్కడే ఉన్న మరో 13 మందిని పోలీసుల అరెస్ట్ చేశారు. విష్ణు పరారయినా అతని నివాసం నుంచి లక్ష 26 వేల 890 రూపాయల నగదు, బెట్టింగ్‌కు ఉపయోగిస్తున్న రెండు లాప్‌టాప్‌లు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వారిపై పోలీసులు నిఘా లోపభూయిష్టంగా ఉన్నాయనే విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల నుంచి కొందరు పోలీసులు మామూళ్లు తీసుకుని చూసి చూడనట్టు వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories