CPI Narayana: రుషికొండ మొత్తం తవ్వేస్తారా?

CPI Narayana has Destroyed Nature with illegal Mining in Rushikonda
x

CPI Narayana: రుషికొండ మొత్తం తవ్వేస్తారా?

Highlights

CPI Narayana: రుషికొండలో అక్రమ తవ్వకాలతో ప్రకృతిని నాశనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు

CPI Narayana: విశాఖ రుషికొండ తవ్వకాల‌ను పరిశీలించేందుకు వెళ్ళిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను పోలీసులు అడ్డుకున్నారు. రుషికొండలో అక్రమ తవ్వకాలతో ప్రకృతిని నాశనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 5 ఎకరాల్లో నిర్మాణాలు అని చెప్పి 30 ఎకరాల్లో తవ్వకాలు జరుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకృతిని పరిరక్షించేందుకు ప్రజా ఉద్యమాన్ని చేపడతామని నారాయణ చెప్తున్నారు. రిసార్ట్‌ నిర్మాణాల పేరుతో అడ్డగోలుగా రుషికొండను తవ్వేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో దీనిపై హైకోర్టులో విచారణ కూడా కొనసాగుతుంది. రుషికొండ తవ్వకాల పనులను పరిశీలనకు వెళ్లిన విలేకరులను నిర్బంధించి ఇబ్బందులకు గురి చేశారు. దీంతో వారిని పరామర్శించేందుకు వెళ్లిన నారాయణ అక్కడి నుంచి రుషికొండకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories