Covid Vaccine: ఏపీకి మరో 4.8లక్షల కొవిషీల్డ్ డోసులు

covishield vaccine doses
x

కొవిషీల్డ్‌ ఫైల్ ఫోటో  

Highlights

Covid Vaccine: క‌రోనా వ్యాక్సిన్ కొర‌త‌తో ఇబ్బంది ప‌డుతున్న ఏపీకి ఊర‌టనిచ్చే వార్త ఇది. రాష్ట్రాల‌నికి మరో 4.8 లక్షల కొవిషీల్డ్ టీకాలు రాష్ట్రానికి...

Covid Vaccine: క‌రోనా వ్యాక్సిన్ కొర‌త‌తో ఇబ్బంది ప‌డుతున్న ఏపీకి ఊర‌టనిచ్చే వార్త ఇది. రాష్ట్రాల‌నికి మరో 4.8 లక్షల కొవిషీల్డ్ టీకాలు రాష్ట్రానికి చేరుకున్నాయి. పూణేలోని సీరం ఇన్ స్టిట్యూట్ నుంచి గ‌న్నవరం విమానాశ్రయానికి తరలించారు. వీటిని తొలుత గన్నవరంలోని వ్యాక్సిన్ స్టోరేజి యూనిట్ లో భద్రపరుస్తారు. ఆరోగ్యశాఖ ఆదేశాలపై ఈ కొవిషీల్డ్ డోసులను జిల్లాలకు తరలిస్తారు. తాజా డోసులు వచ్చిన నేపథ్యంలో రెండో డోసు వారికి పూర్తి చేయాలని అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

కొత్తగా వచ్చిన టీకా డోసులతో రాష్ట్రంలో టీకాల కొరత నుంచి కొంత ఉపశమనం కలుగుతుందని భావిస్తున్నారు.కాగా, పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ డోసులు కొనుగోలు చేసేందుకు ఏపీ సర్కారు గ్లోబల్ టెండర్లు పిలుస్తున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ టెండర్ల ద్వారా రాష్ట్రానికి అవసరమైనన్ని వ్యాక్సిన్ డోసులు పొందేందుకు వీలవుతుందని సర్కారు భావిస్తోంది. వ్యాక్సిన్ల కొరతతో ఏపీలో సోమ, మంగళవారాల్లో చాలా జిల్లాల్లో వ్యాక్సినేషన్ జరగలేదు. ఇవాళ రంజాన్ అయిన‌ప్ప‌టీకి రెండో వ్యాక్సిన్ కొన్ని ప్రాంతాల్లో జ‌ర‌గ‌లేదు.

ప్రజలకు వీలైనంత త్వరగా కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయం మేరకు అధికారులు వాటి కోసం గ్లోబల్‌ టెండర్లను పిలిచారు. ఈ విషయాన్ని వారు సీఎంకు తెలిపారు. రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని కోవిడ్‌ వ్యాక్సిన్ల కోసం గ్లోబల్‌ టెండర్లు పిలిచామని వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories