Ganesh Chaturthi 2021: ఏపీలో వినాయక చవితి ఉత్సవాలకు బ్రేక్

Covid Rules for Ganesh Chaturthi 2021 Celebrations in Andhra Pradesh | AP News Today
x

ఏపీలో వినాయక చవితి ఉత్సవాలకు బ్రేక్

Highlights

Ganesh Chaturthi 2021: * బయట గణేష్‌ విగ్రహాల ఏర్పాట్లు చేయకూడదని ఆదేశాలు * ఇంట్లో, ఆలయాల్లో పూజలు చేసుకోవాలని సూచన

Ganesh Chaturthi 2021: వేడుకలు కరోనాను పంచే వేదికలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి కూడా వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలు విధించింది. ఇంట్లో, ఆలయాల్లో తప్ప ఎక్కడా వినాయక విగ్రహాల ఏర్పాట్లు చేయకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా కర్నూలు లో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ వివాదాస్పదమవుతుంది. జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు, ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ఉత్సవాలు నిర్వహించరాదని, నిమజ్జన ఊరేగింపు చేయరాదని ఆదేశాలు జారీ చేశారు. కరోనా నిబంధనల దృష్ట్యా వినాయక చవితి ఉత్సవాల పై ఆంక్షలు తప్పకుండా పాటించాలని సూచించారు. దీంతో అధికారుల ఆదేశాలను వినాయక నిమజ్జన ఉత్సవ కమిటీ, బీజేపీ నేతలు ఖండించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories