Covid Rules: ఏపీలో కర్ఫ్యూ సడలింపుతో కొవిడ్ నిబంధనలు గాలికి

Covid Rules Break in AP Due to Curfew Relaxation
x

కరోనా నిబంధనలు గాలికి వదిలేసినా జనం (ఫైల్ ఇమేజ్)

Highlights

Covid Rules: పర్యాటకులతో కిక్కిరిసిపోతున్న అరకు లోయ * మాస్క్‌లు, భౌతికదూరం, శానిటైజర్లను మరిచిన జనం

Covid Rules: ఆంధ్రా ఊటీ అందాల అరకులోయ పర్యాటకులతో కిటకిటలాడుతుంది. అలా అనుమతులు వచ్చేయో లేదో జనాలు తాకిడి విపరీతంగా పెరిగిపోయింది. ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టిన జనాలు అరకు అందాలను వీక్షించడానికి తండోపతండాలుగా తరలివస్తున్నారు. కరోనా తగ్గిపోయిందిలే అని నిర్ణక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

కర్ఫ్యూ నిబంధనల సడలింపుల తరువాత ప్రజలు పూర్తిగా కొవిడ్‌ నిబంధనలను విస్మరించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని నిపుణులు, అధికారులు సూచిస్తున్నా, అస్సలు పట్టించుకోవడం లేదు. పైపెచ్చు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పర్యాటక ప్రాంతాలు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. భౌతిక దూరం అనేమాట ఎక్కడా కనిపించడం లేదు. కనీసం మాస్క్‌ అయినా వాడుతున్నారా అంటే అదీ లేదు. ఒకపక్క అధికారులు హెచ్చరిస్తున్నా, ముక్కుపచ్చలారని చిన్నారులను సైతం పర్యాటక ప్రాంతాల్లో తిప్పుతున్నారు.

మూడునెలలు పాటు ఇళ్ళకే పరిమితమైన ఆంధ్ర, తెలంగాణతో పాటు, దేశ విదేశాల్లో పర్యాటకులు అరకులోయ అందాలను తిలకించడానికి తరలివస్తున్నారు. అరకు అందాలు వీక్షించడానికి వచ్చిన సందర్శకులు కరోనా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరింస్తుడడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సెకెండ్ వేవ్ము ప్పు నుండి ఇప్పుడిప్పుడే తెరుకుంటున్నా... థర్డ్ వేవ్ ముప్పు వెంటాడుతుంది.

అరకు అందాలను తిలకించే పర్యాటకులు భౌతిక దూరం పాటించకపోవడం, మాస్క్ లు ధరించకపోవడం, గుంపులు గుంపులుగా తిరుగుతుండడంతో అరకులోయలో డేంజర్ బెల్ మ్రోగే ప్రమాదం ఉందని మేధావులు అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories