Vijayawada: షాపింగ్ కాప్లెక్సులపై కోవిడ్ కర్ఫ్యూ ఎఫెక్ట్

Covid Curfew Effect  on Shopping Complexes in Vijayawada
x

షాప్పింగ్ కాంప్లెక్స్ ల పై కరోనా కర్ఫ్యూ ఎఫెక్ట్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Vijayawada: కర్ఫ్యూ సడలింపుల్లో కనికరించని కష్టమర్స్

Vijayawada: వ్యాపారం ఉన్నా లేకున్నా మెయింటినెన్స్ మాత్రం కామన్ అద్దెలు, కరెంట్ బిల్లులు, కార్మికుల జీతాలు అంటూ అదో తలకుమించిన భారమనే చెప్పాలి. విజయవాడలో పెద్దగా కనిపించే షాపింగ్ కాప్లెక్సుల కర్ఫ్యూ కష్టాలివి.

ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద షాపింగ్ సిటీగా విజయవాడను చెబుతారు. అలాంటి నగరంలో కరోనా కారణంగా బిజినెస్ లేక వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కర్ష్యూ పరిస్థితుల్లో ఉదయం షాపు తెరిచినా కొనే నాధుడు ఉండడు. దీంతో కర్ఫ్యూ సడలింపుల సమయంలో నాలుగు గంటలు ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి. దీనికితోడు షాపుల అద్దెలు, కార్మికులకు జీతాలు చెల్లించలేక నలిగిపోతున్నామని వ్యాపారులు వాపోతున్నారు.

వ్యాపారం నడవడమే కష్టమవుతున్న వేళ షాపుల మెయింటెనెన్స్ తలకుమించిన భారమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కష్టమర్లు వచ్చినా రాకున్నా కరెంటు బిల్లులు సహా అనేకరకాల ఖర్చులు మాత్రం తప్పడం లేదంటున్నారు. ముఖ్యంగా క్లాత్ మర్చంట్స్ పరిస్థితి ఇంకా దారుణం. పెళ్లిళ్ల సీజన్‌ మే నెల మొత్తం లాక్‌డౌన్‌తోనే గడిచిపోయింది. సడలింపుల్లో రెండు గంటల సమయం పెరిగిందీ అనుకుంటే అదికాస్తా షాపులు మూసుకోడానికే సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇటు.. మహిళా వ్యాపారుల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా తయారయింది. కరోనా కష్టాలను తట్టుకోలేకపోతున్నామని మహిళలు వాపోతున్నారు. కొందరు బ్యాంకుల నుంచి లోన్లు పొందుతున్నా మరికొందరికి ఆర్థిక కష్టాలు తప్పడం లేదు. కర్ఫ్యూ సడలింపు సమయం మరింత పెంచితేనే ఈ కష్టాల నుంచి గట్టెక్కగలం అంటున్నారు.

ఇక.. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న ఈ సమయంలో మరిన్ని సడలింపులు ఇచ్చి ఆదుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు. మరి.. వ్యాపారుల అభ్యర్థనపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories