Coronavirus Pandemic: అంతా మా ఇష్టం అన్నట్టు ప్రవర్తిస్తున్న జనం.. జాగ్రత్తలు గాలికొదిలేసిన వైనం!

Coronavirus Pandemic: అంతా మా ఇష్టం అన్నట్టు ప్రవర్తిస్తున్న జనం.. జాగ్రత్తలు గాలికొదిలేసిన వైనం!
x
Highlights

Coronavirus Pandemic: : ఎక్కడికి వెళ్లాలన్నా గుబులు ఏం చేయాలన్నా జడుపు ఆఖరికి ఏది ముట్టుకోవాలన్నా బెదురు ఇది కరోనా మహమ్మారితో గజగజలాడుతోన్న ప్రపంచ...

Coronavirus Pandemic: : ఎక్కడికి వెళ్లాలన్నా గుబులు ఏం చేయాలన్నా జడుపు ఆఖరికి ఏది ముట్టుకోవాలన్నా బెదురు ఇది కరోనా మహమ్మారితో గజగజలాడుతోన్న ప్రపంచ దేశాల ప్రస్తుత పరిస్థితి. కరోనా కట్టడి కోసం కరోనాతోనే కలిసి జీవనం సాగించాల్సిన దుస్థితి. అయితేనేం Coronavirus Updates in India: భారత్‌లో కొత్తగా 22,771 కరోనా పాజిటివ్‌ కేసులు కరోనా మా దరికి చేరుతుందా అనే నిర్లక్ష్యంతో యాథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్న కొందరు మహానుభావులపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ.

దేశవ్యాప్తంగా అన్ లాక్ డౌన్ 2 సడలింపులు ప్రారంభం కావడంతో రోడ్లపై రద్దీ మరింత పెరిగింది. అదే సమయంలో కరోనా నియంత్రణలో కనీస జాగ్రత్తలైన మాస్క్, శానిటైజర్, సామాజిక దూరం వంటి అంశాలను కూడా తుంగలో తొక్కుతున్నారు కొందరు మహానుభావులు. అటు విజయవాడ నగరంలో అయితే పరిస్థితి మరింత దిగజారినట్లు కనబడుతుంది. రోడ్లపై మాస్కులు లేకుండా విచ్చలవిడిగా తిరుగుతోన్న జనాలను చూస్తే అసలు కరోనా వైరస్ ఉందా లేక కనుమరుగైందా అనే అనుమానం కలుగుతోంది.

ముఖానికి మాస్కులు, తరచూ శానిటైజర్ల వినియోగం, సామాజిక దూరం తప్పక పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గగ్గోలు పెడుతున్నప్పటికీ కొందరు నగరవాసులు పెడచెవిన పెడుతున్నారు. ఈ నేపథ్యంలో విచ్చలవిడిగా రోడ్లపైకి వస్తున్న జనాలతో విసుగొచ్చిన విజయవాడ ట్రాఫిక్ పోలీసులు మాస్కులు ధరించకపోతే ఫైన్లు విధిస్తున్నారు. మాస్క్ ధరించని వారికి అర్భన్ లో వంద రూపాయలు, రూరల్ లో 50 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు.

ఏదేమైనా ప్రజలను ఫైన్ల పేరిట భయపెట్టి అయినా సరే కరోనా జాగ్రత్తలు పాటించేలా చేస్తున్నామని విజయవాడ ట్రాఫిక్ పోలీసుల చెప్తున్నారు. మరీ ప్రభుత్వం, పోలీసులు ఎవరూ ఏం చెప్పినా అది ప్రజల బాగు కోసమేనని గుర్తించి అందరూ కరోనా నియంత్రణ పట్ల ఏకతాటిపై వచ్చి మహమ్మారిని కట్టడి చేయాలని కోరుకుందాం.


Show Full Article
Print Article
Next Story
More Stories