Corona Effect : హార్సిలీ హిల్స్ పై కరోనా ఎఫెక్ట్

Corona Effect : హార్సిలీ హిల్స్ పై కరోనా ఎఫెక్ట్
x
Highlights

Corona Effect: హార్సిలీ హిల్స్ ఇప్పుడు మూగబోయింది. కరోనా ఎఫెక్ట్ తో పర్యాటకులు కరవై హారిలే హిల్స్ ఇప్పుడు బావురుమంతోంది.

Corona Effect: పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్ ను కరోనా కోలుకోని విధంగా దెబ్బతీసింది. ఆంధ్ర ఊటీ, కాశ్మీర్ గా పేరు గాంచిన అందమైన ఆ ప్రదేశం మంచి సీజన్ లో మంచానపడింది. ఆంధ్రా ఊటీ గా పేరుగాంచిన హార్సిలీ హిల్స్, చల్లని, ఆహ్లాదకరమైన వాతావరణానికి మారు పేరు. సముద్రమట్టానికి వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం వేసవికి పెట్టింది పేరు. మండుటెండల్లో కూడా ఇక్కడ మంచు కురుస్తుంది. అందుకే ఈ ప్రాంతానికి కాశ్మీరం అని కూడా పేరుంది. ఎండాకాలంలో కాశ్మీరు చూడలేని ఎందరో ఇక్కడికెళ్ళి కాశ్మీరును చూసినంత అనుభూతిని పొందుతారు. ఊటిని తలపించేలా ఇక్కడి ప్రకృతి ఉంటుంది. అందుకే ఇక్కడ విడిది కేంద్రాలకు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. రాష్ట్రపతి, గవర్నర్లకు కూడా ఇక్కడ విడిది కేంద్రాలున్నాయి. ఎత్తైన కొండపై హోటళ్లు, అతిథి గృహాలు క్రీడా ప్రాంగణంతో పాటు సాహస విన్యాసాలన్ని పర్యాటకశాఖ నిర్వహిస్తూ ఆదాయాన్ని పొందుతోంది. వేసవి కాలంలో రద్ధీ అధికంగా ఉండటంతో పాటు పర్యాటక శాఖకు కాసుల వర్షాన్ని కురిపిస్తుంది. ఆగష్టు దాకా పర్యాటకులతో కలకలలాడుతుంటుంది‌. కొన్నిసార్లు ఇక్కడ విడిది గృహాలు దొరకడమూ దుర్లబమే.

ఈసారి వేసవి కాలంలో పర్యాటకుల రద్దీతో ఆదాయం భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఫిబ్రవరి నుంచే కరోనా ప్రభావం ప్రారంభమై పర్యాటకుల తాకిడి తగ్గిపోతూ వచ్చింది. ఈ లోగా దేశవ్యా ప్తంగా కరోనా వ్యాప్తి అధికమైపోవడంతో మార్చి 22నుంచి లాక్ డౌన్ అమలుచేశారు. దాంతో కొండపై పర్యాటకుల రాక నిలిచిపోయింది. అన్ లాక్ సౌలభ్యం వచ్చినా రద్దీ పెద్దగా లేదు. కోవిడ్ భయంతో సందర్శకులు రాకపోవడంతో పర్యాటకశాఖ చరిత్రలో తొలి సారిగా హార్సిలీహిల్స్ యూనిట్ నష్టపోయింది. ఈ ఏడాది మార్చి 22 నుంచి ఇప్పటివరకు రూ.1.54 కోట్లకు పైగా రాబడిని కోల్పోయింది. లాక్ డౌన్ సడ లింపుల నేపథ్యంలో గత నెల ఎనిమిదో తేదీ నుంచి అతిథి గృహాలను పర్యాటక శాఖ పునఃప్రారంభించినా పర్యాటకులు నామ మాత్రంగానే వస్తున్నారు.

హార్సిలీహిల్స్ పర్యాటకశాఖ యూనిట్టు ప్రారంభమైన తర్వాత ఏటా ఆదాయం పెరుగుతూ వస్తోంది. హార్సిలీహిల్స్ యూనిట్టుకు 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.3.07 కోట్లు మాత్రమే వచ్చింది. 2016-17లో రూ.4. 09 కోట్లు, 2017 లో రూ.4.19కోట్లు, 2018-19లో రూ.4.59 కోట్ల రాబడి వచ్చింది. ఈ ఏడాది మార్చిలో కరోనా ప్రభావం ప్రారంభం కావడంతో గత ఆర్థిక సంవత్సరం 2019-20లో రూ.4.4 కోట్ల రాబడి వచ్చింది. గత ఏడాదితో పోల్చి చూస్తే ఆదాయం బాగా పడిపోయింది. ఇప్పటి వరకు మూడున్నర నెలలు గడిచి పోయాయి. గత ఏడాది గణాంకాల ప్రకారం చూస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.1.54 కోట్ల ఆదాయం రావాలి. ఏప్రిల్, మే నెలల్లో లాక్ డౌన్ వల్ల ఆదాయం రాలేదు. గత నెల ఎని మిదోతేది నుంచి అతిథి గృహాలను పునఃప్రారంభించినా ఇప్పటివరకు కేవలం రూ. 14లక్షలు వచ్చింది. కొండపై ఉన్న అతిథి గృహాల్లో 52గదులు ఉన్నా రెండు, మూడు గదులు బుక్ చేయడం కష్టంగా మారింది.

ఇటీవల కురిసిన వానలకు కొండపై పచ్చ దనం సంతరించుకుని వాతావరణం ఆహ్లాద కరంగా మారింది. పైగా విద్యార్థుల సెలవులు కొనసాగుతున్నాయి. కొండపై సందర్శనకు అనువైన సమయమైనా పర్యాటకులు వచ్చేందుకు భయపడుతున్నారు. దీంతో స్థానిక వ్యాపారులకూ ఉపాది కోల్పోతున్నారు. పర్యాటక రంగంపై ఆధారపడి మదనపల్లెలో వెలసిన హోటళ్ళు రెస్టారెంట్లు కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. స్థానికంగా పర్యటకులను నమ్ముకుని జీవించే చిరు వ్యాపారులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, గైడ్లు ఉపాధిని కోల్పోయి పూర్వ వైభవం కోసం ఎదురు చూస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories