Visakha: విశాఖలో విజృంభిస్తోన్న కరోనా

Corona booming in Visakhapatnam
x

విశాఖపట్నం:(ఫైల్ ఇమేజ్)

Highlights

Visakha: స్టీల్ సిటీ విశాఖలో కరోనా విజృంభిస్తోంది.

Visakha: స్టీల్ సిటీ విశాఖలో కరోనా విజృంభిస్తోంది.రోజు రోజుకూ వందలాది కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. సెకండ్ వేవ్ ముప్పు ముంచుకొస్తుండడంతో అధికారులు అలర్ట్‌ అయ్యారు.. మరోవైపు ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించకుంటే ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జనాలు సోషల్ డిస్టెన్స్, మాస్క్ ధరించేలా అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కొవిడ్ మహమ్మారిని తరిమికొట్టేందుకు శానిటైజేషన్ చేస్తున్నారు.

గ్రేటర్ విశాఖలో...

గ్రేటర్ విశాఖలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దాంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కొవిడ్ ఉధృతం అవుతుండడంతో వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించారు.. గతంలో అనుమానాలు, భయం వల్ల వ్యాక్సిన్‌ వేసుకోవడానికి వెనుకంజ వేసిన ప్రజలు ఇప్పుడు ఆసక్తి చూపుతున్నారు.. అందుకు అనుగుణంగా వైద్యాధికారులు వ్యాక్సిన్ అందుబాటులో ఉంచారు..

అప్రమత్తం అయిన అధికారులు...

కొవిడ్ సెకండ్ వేవ్ ముంచుకొస్తుండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.. రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బులు, కిడ్నీ వంటి వ్యాధులతో బాధపడేవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే.. సెకండ్ వేవ్ విజృంభించడానికి ముఖ్య కారణం ప్రజల నిర్లక్ష్యమేనంటున్నారు.

గత అయిదు రోజుల వ్యవధిలో ...

జిల్లా వ్యాప్తంగా గత అయిదు రోజుల వ్యవధిలో 354 కేసులు నమోదయ్యాయి. రోజుకు వందకు పైగా కేసులు నమోదు అవుతుండడంతో అధికారులు అలెర్ట్ అయ్యారు.. పాజిటివ్ కేసులు వచ్చిన ప్రదేశాల్లో శానిటైజ్ చేస్తున్నారు. అయితే.. కొవిడ్‌ను తరిమికొట్టాలంటే ప్రజలు కచ్చితంగా నియమాలు పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ నుంచి బయటపడాలంటే.. ప్రజలు వ్యక్తిగత శుభ్రత, భౌతికదూరం, మాస్క్‌లు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories