Kadapa: బ్రహ్మంగారి మఠం: జటిలంగా మారిన వారసుల మధ్య ఆధిపత్య పోరు

War on Brahmamgari matam
x

Brahmamgari Matam (వికీపీడియా)

Highlights

Kadapa: కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం వారసత్వంపై వివాదం తారాస్థాయికి చేరింది.

Kadapa: కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం వారసత్వంపై వివాదం తారాస్థాయికి చేరింది. ఇటీవల బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి (7వ తరం) ఆనారోగ్యం కార‌ణంగా తుదిశ్వాస విడిచారు. ఆయ‌న మార‌ణాంత‌రం ఈ వివాదం చెల‌రేగింది. నూతన పీఠాధిపతి ఎంపిక ప్రక్రియ కుటుంబ సభ్యుల మధ్య గొడవకు దారితీసింది. మఠాధిపతిగా ఉన్న వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్యలు కాగా.. ఏ భార్యకు చెందిన సంతానం పీఠాధిపతి బాధ్యతలు చేపట్టాలన్న దానిపై వివాదం ఏర్పడింది.

ఇద్దరు భార్యలకు చెందిన సంతానం... పీఠం తమదంటే తమదని రంగంలోకి దిగడంతో కొత్త పీఠాధిపతి ఎవరన్నది ఇప్పటికీ తేలలేదు. మొదటి భార్యకు నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. రెండో భార్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పీఠాధిపతి పదవి తనకే దక్కాలంటున్న పెద్దభార్య కుమారుడు డిమాండ్‌ చేస్తున్నారు. తన కుమారుడికే ఇవ్వాలని వీలునామా రాశారని చిన్న భార్య చెబుతున్నారు. వారసుల మధ్య విబేధాల నేపథ్యంలో పీఠాధిపతి ఎంపిక ప్రక్రియలో సందిగ్ధత నెలకొంది.

ఇక,sతన కొడుకు మైనర్ కావడంతో పీఠాధిపతి బాధ్యతలు తాను స్వీకరిస్తానని రెండో భార్య చెప్పడంతో ఏమీ తేల్చలేక అధికారులు ఆ విచారణను అంతటితో నిలిపివేశారు. మ‌రోపక్క, వీలునామాలో తనపేరే ఉందని మొదటి భార్య రెండో కొడుకు కూడా రేసులోకి వచ్చాడు. దాంతో, బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి అంశం జటిలంగా మారింది. అయితే, రెండో భార్య పెద్దకొడుకు ఇంకా మైనర్ కావడంతో అతడికి పీఠాధిపతి అయ్యే అవకాశాలు తక్కువేనని భావిస్తున్నారు.

కొత్త పీఠాధిపతి ఎంపికకు దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ ప్రతాప్ రంగప్రవేశం చేశారు. ఆయన వీరభోగ కుటుంబ సభ్యులతోనూ, స్థానికులతోనూ ఈ విషయంపై విచారించారు. స్థానికులు మాత్రం మొదటి భార్య రెండో కొడుకు వైపు మొగ్గుచూపగా, పీఠాధిపతి అయ్యే అర్హత తనకే ఉందని పెద్దకొడుకు వాదించినట్టు తెలిసింది. దీంతో స‌మ‌స్య మ‌రింత జ‌టిలంగా మారింది. బ్ర‌హ్మంగారి కుటుంబ స‌భ్యులు ఇలా గొడ‌వ ప‌డ‌టం స్థానికుల్లో ఆందోళ‌న మొద‌లైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories