Ponguleti : ఆ గట్టునుంటాడా... ఈ గట్టునుంటాడా?

Congress Leaders Showing Impatience On Former Mp Ponguleti Srinivas Reddy
x

పొంగులేటి: ఆ గట్టునుంటాడా... ఈ గట్టునుంటాడా?

Highlights

Mp Ponguleti Srinivas Reddy పొంగులేటిలో కన్ఫ్యూజన్ రంగంలోకి అమిత్ షా వచ్చారా?

Mp Ponguleti Srinivas Reddy: ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కీలక వ్యక్తిగా మారారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆయన కోసం రెండు జాతీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. తన రాజకీయ భవిష్యత్తు.. జిల్లాపై పట్టు నిలుపుకోవడంతో పాటు వచ్చే ఎన్నికల్లో కీలక భూమిక పోషించేందుకు ఏ పార్టీలో చేరాలన్న దానిపై పొంగులేటి వ్యూహరచన చేస్తున్నారు. అనుచరుల సలహాలు తీసుకుంటేనే భవిష్యత్ ప్రణాళికలు రచిస్తున్నారు.

అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు పొంగులేటి మొగ్గుచూపినా... ఆయన మదిలో ఏ మూలనో కాస్త సంకోచం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లోకి వెళ్లాలా వద్దా..? అన్న మీమాంస పొంగులేటిని పీడిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దానికి తోడు బీజేపీ నుంచి జాతీయ నేతలు సైతం పొంగులేటిని రారామ్మని ఊరిస్తుండటంతో ఎటూ తేల్చుకోలేక మదన పడుతున్నారని ఖమ్మంలో చర్చ నడుస్తోంది.

హస్తం తీర్థం పుచ్చుకోవాలని డిసైడ్ అయిన తర్వాత... కమలం నేతల నుంచి మరోమారు ఆయనకు పిలుపు అందినట్లు తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్‌లో చేరిక కోసం ఖమ్మంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభను సైతం పొంగులేటి వాయిదా వేసినట్లు జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గతంలో పలువురు బీజేపీ రాష్ట్ర, జాతీయ నేతలు పొంగులేటితో మాట్లాడినా అంతగా ఆసక్తి చూపని పొంగులేటి... ఈ సారి నేరుగా అమిత్ షానే రంగంలోకి మాట్లాడని.. అందుకే పొంగులేటి కాంగ్రెస్‌లో చేరేందుకు సంశయిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటు కాంగ్రెస్‌లోకి వెళ్లాలా..? కాషాయ కండువా కప్పుకోవాలో తెలియక పొంగులేటి మదన పడుతున్నట్లు ఆయన అనుచర వర్గం నుంచి వినిపిస్తోంది. హస్తం పార్టీలోని సీనియర్లు పొంగులేటి చేరికను వ్యతిరేకించినా... డీకే శివకుమార్ లాంటి నేతలు చెప్పడంతో పొంగులేటీ కాంగ్రెస్ గూటికే చేరదాని పొంగులేటి అనుకున్నారట. అయితే రాహుల్ గాంధీ నుంచి స్పష్టమైన హామీ వచ్చిన తర్వాతే చేరుదామన్న ఆలోచనలో పొంగులేటి ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

మొత్తంగా రాహుల్ గాంధీ అమెరికా పర్యటన అనంతరం పొంగులేటి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా..? లేదా అన్న అంశంపై స్పష్టత రానుంది. రాహల్ భారత్‌కు వచ్చాక ఆయనతో నేరుగా మాట్లాడి, స్పష్టమైన హామీ తీసుకున్న తర్వాత పార్టీలో చేరాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది

Show Full Article
Print Article
Next Story
More Stories