Sriharikota: శ్రీహరికోట షార్ లో కలకలం.. 24 గంటల వ్యవధిలో ఇద్దరు జవాన్ల ఆత్మహత్య

Commotion In Sriharikota Shore
x

 Sriharikota: శ్రీహరికోట షార్ లో కలకలం.. 24 గంటల వ్యవధిలో ఇద్దరు జవాన్ల ఆత్మహత్య

Highlights

Sriharikota: తుపాకీతో కాల్పుకున్న సీఐఎస్ఎఫ్ ఎస్ఐ

Sriharikota: తిరుపతి జిల్లాలోశ్రీహరికోట షార్‌ 24 గంటల వ్యవధిలో ఇద్దరు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాల సిబ్బంది ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. ఒకరు ఉరేసుకుని మరొకరు తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. 24గంటల వ్యవధిలోనే ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడడంతో షార్​లో అలజడిరేపింది. సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ చింతామణి రాడార్ సెంటర్ సమీపంలో చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు. చింతామణి ఈనెల 10న విధుల్లోకి చేరాడు. ఈ సంఘటన నుంచి తేరుకోక ముందే సీఐఎస్ఎఫ్ ఎస్ఐ వికాస్ సింగ్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఒకే రోజు రెండు సంఘటనలు జరగడంతో సీఐఎస్ఎఫ్ వర్గాల్లో కలకలం రేపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories