100 ఈ-బస్ సర్వీసులను ప్రవేశపెడుతున్న ఆర్టీసీ.. నేడు అలిపిరిలో ప్రారంభించనున్న సీఎం జగన్

CM YS Jagan will Start Electric Bus Services in Tirumala Tirupati
x

100 ఈ-బస్ సర్వీసులను ప్రవేశపెడుతున్న ఆర్టీసీ.. నేడు అలిపిరిలో ప్రారంభించనున్న సీఎం జగన్

Highlights

*తొలుత తిరుమల ఘాట్‌ రోడ్డులో 10 ఈ-బస్సులు

Andhra Pradesh: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమల - తిరుపతిని కేంద్రంగా చేసుకుని తొలిసారిగా ఎలక్ట్రికల్ బస్సులను APSRTC ప్రవేశపెడుతోంది. తిరుమల, తిరుపతిలో 100 ఈ-బస్సులను ప్రవేశపెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి విడతలో 10 ఎలక్ట్రికల్ బస్సులను ఇవాళ సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. అనంతరం దశల వారీగా డిసెంబర్ నాటికి 100 ఈ-బస్సులను ఆర్టీసీ ప్రవేశపెట్టనుంది. అందులో భాగంగా తిరుమల- తిరుపతి కనుమ దారిలో 50 బస్సులు, రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమల వరకు 14 బస్సులు, తిరుపతి నుంచి నెల్లూరు 12 బస్సులు, తిరుపతి- కడప రూట్‌లో 12, తిరుపతి- మదనపల్లె రూట్‌లో మరో 12 బస్సులు నడపనున్నారు. ఎలక్ట్రికల్ ఏసీ బస్సు టికెట్ ధర సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories