YS Jagan: నేడు ఈ జిల్లాల్లో 14 మెడిక‌ల్ కాలేజీల‌కు సీఎం శంకుస్థాపన

YS Jagan Fountation Stone on 14 Medical Colleges
x

YS Jagan:File Photo

Highlights

YS Jagan: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నూత‌న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్ట‌నుంది.

YS Jagan: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నూత‌న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్ట‌నుంది. రాష్ట్రంలో నిర్మించ‌నున్న‌ 14 మెడిక‌ల్ కాలేజీల‌కు సీఎం వైఎస్ జగన్‌ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో మొత్తం 16 వైద్య కళాశాలలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో రెండు.. పులివెందుల, పాడేరులలో ఇప్పటికే పనులు మొదలయ్యాయి. ఇటీవల తలెత్తిన ఆక్సిజన్ సంక్షోభం నేపథ్యంలో నిర్మిస్తున్న ప్రతి ఆసుపత్రిలోనూ ఆక్సిజన్ ట్యాంకులు, ఉత్పత్తి కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నారు.

విజయనగరం, అనకాపల్లి, రాజమహేంద్రవరం, పాలకొల్లు, అమలాపురం, ఏలూరు, మచిలీపట్టణం, బాపట్ల, మార్కాపురం, పిడుగురాళ్ల, మదనపల్లి, పెనుకొండ, ఆదోని, నంద్యాలలో కొత్త కళశాలలను నిర్మించనున్నారు. ఇందుకోసం మొత్తం రూ. 8 వేల కోట్లు వెచ్చిస్తున్నారు. 2023 చివరి నాటికి వీటి నిర్మాణం పూర్తికానుందని ప్రభుత్వం తెలిపింది.

అలాగే, నర్సింగ్ కళశాలలను కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. వీటి ద్వారా 1,850 సీట్లు, 32 విభాగాలకు సంబంధించిన సేవలు అందుబాటులోకి వస్తాయిని పేర్కొంది. ఇక, కొత్తగా నిర్మిస్తున్న ప్రతి కళాశాలలో 500 పడకలకు తగ్గకుండా అందుబాటులోకి వస్తాయని వివరించింది. మిగిలిన 14 కశాశాలలకు జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో శిలాఫలకాలను ఆవిష్కరించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories