మూడేళ్ళ ఎదురుచూపులు ఫలించిన వేళ..

మూడేళ్ళ ఎదురుచూపులు ఫలించిన వేళ..
x
Highlights

రాష్ట్రంలో ప్రభుత్వ బదిలీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు... ఈ మేరకు బదిలీలకు..

రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు... ఈ మేరకు ఉపాధ్యాయ బదిలీలకు ఆమోదం తెలుపుతూ సంబంధిత ఫైల్‌పై సంతకం చేశారు సీఎం.. రెండు, మూడు రోజుల్లో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా టీచర్ల బదిలీలను చేపట్టనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 29వ తేదీ నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉపాధ్యాయులందరూ బదిలీలకు అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది.. కాగా మూడేళ్లుగా బదిలీల కోసం ఉపాధ్యాయులు ఎదురుచూశారు.

ఎట్టకేలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. టీచర్లకు స్కూళ్ల ఎంపిక ఆప్షన్ల నమోదు నుంచి బదిలీ ఉత్తర్వులు జారీ వరకు పూర్తి ప్రక్రియలను ఆన్‌లైన్లోనే విద్యాశాఖ నిర్వహించనుంది.. క్షేత్రస్థాయిలో అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ బదిలీ నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇక టీచర్ల బదిలీలకు ఆమోదం తెలపడంపై ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కె.వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories