CM Jagan: ఇవాళ తిరుపతిలో సీఎం జగన్‌ టూర్

CM Jagans Tour in Tirupati ‎Today
x

CM Jagan: ఇవాళ తిరుపతిలో సీఎం జగన్‌ టూర్

Highlights

CM Jagan: జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా తల్లుల ఖాతాలోకి డబ్బులు

CM Jagan: ఇవాళ తిరుపతిలో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం, 11.05 గంటలకు తిరుపతి ఎస్‌వీ వెటర్నరీ కాలేజ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత 11.20 గంటలకు ఎస్‌వీ యూనివర్శిటీ స్టేడియం చేరుకుని జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సంభాషణ, అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

ఆ తర్వాత 12.55 గంటలకు శ్రీ పద్మావతి చిల్డ్రన్స్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి చేరుకుంటారు. అక్కడ టీటీడీ చిన్నపిల్లల ఆసుపత్రి భవన నిర్మాణానికి సంబంధించి భూమిపూజలో పాల్గొంటారు. అక్కడే ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం అక్కడి నుంచి టాటా కేన్సర్‌ కేర్‌ సెంటర్‌ కు చేరుకుని నూతన ఆసుపత్రిని ప్రారంభిస్తారు. కార్యక్రమం అనంతరం 2.25 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 3.35 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

జిల్లాల విభజన తరువాత తొలిసారిగా తిరుపతి జిల్లాకు వస్తున్న సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికేందుకు జిల్లాలోని నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. బహిరంగ సభను విజయవంతం చేయడం కోసం భారీ జన సమీకరణ చేస్తున్నారు. మంత్రి రోజా, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి తిరుపతి జిల్లాకు చెంది‌న ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి సభా ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరం నిఘా నీడలో చేరింది. సభా ప్రాంగణంమంతా సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories