కేంద్రమంత్రులు నిర్మలా, పీయూష్ గోయల్ కు సీఎం జగన్ లేఖ

CM Jagans Letter to Union Ministers Nirmala Sitharaman and Piyush Goyal
x

కేంద్రమంత్రులు నిర్మలా, పీయూష్ గోయల్ కు సీఎం జగన్ లేఖ

Highlights

CM Jagan: వంటనూనె కొరత నేపథ్యంలో దిగుమతి సుంకుం తగ్గించాలని విజ్ఞప్తి

CM Jagan: కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, పియూష్‌ గోయల్‌ కు సీఎం జగన్ లేఖలు రాశారు. వంటనూనెలకు కొరత నేపథ్యంలో ఆవనూనెపై దిగుమతి సుంకం తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. రష్యా ఉక్రెయిన్‌ పరిస్థితుల దృష్ట్యా సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌కు కొరత ఏర్పడిందని.., ఈ నేపథ్యంలో ఆవనూనె దిగుమతులపై దిగుమతి సంకాన్ని తగ్గించాలని ముఖ్యమంత్రి కోరారు. 2021-22లో దేశంలో వంటనూనెల వినియోగం 240 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా, ఇందులో 40శాతం మాత్రమే దేశీయంగా ఉత్పత్తి అవుతుందన్నారు.

మిగిలిన 60శాతం విదేశాలనుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చిందని సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. దిగుమతి చేసుకుంటున్న వంటనూనెల్లో 95 శాతం పామాయిల్‌ను ఇండోనేషియా, మలేషియాల నుంచి, 92 శాతం సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌ను ఉక్రెయిన్, రష్యాలనుంచి దిగుమతి చేసుకుంటున్నామని గుర్తుచేశారు. ఉక్రెయిన్, రష్యాల్లో పరిస్థితుల వల్ల ఒక్కసారిగా ప్రపంచంలో ఈ వంటనూనెలకు కొరత ఏర్పడిందని, ఈ ప్రభావం వినియోగదారులపై పడిందని వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories