ప్రీ ప్రైమరీ స్కూల్స్‌ తరహాలో అంగన్వాడీలు.. ఏడాదికి 1,862 కోట్ల ఖర్చుకు వ్యయం

ప్రీ ప్రైమరీ స్కూల్స్‌ తరహాలో అంగన్వాడీలు.. ఏడాదికి 1,862 కోట్ల ఖర్చుకు వ్యయం
x
Highlights

నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలలను అభివఈద్ధి చేస్తున్న ఏపీ ప్రభుత్వం, తాజాగా ఇదే విధానంలో అంగన్వాడీల్లో మౌలిక వసతులు పెంచేందుకు ఏర్పాట్లు చేసేందుకు సంకల్పించింది.

నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలలను అభివఈద్ధి చేస్తున్న ఏపీ ప్రభుత్వం, తాజాగా ఇదే విధానంలో అంగన్వాడీల్లో మౌలిక వసతులు పెంచేందుకు ఏర్పాట్లు చేసేందుకు సంకల్పించింది. దీనికి గాను ఏటా రూ. 1,862 కోట్ల వ్యయం చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. దీనిపై సీఎం జగన్మోహనరెడ్డి మహిళా శిశు సంక్షేమశాఖ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాడు- నేడు కార్యక్రమాల తరహాలోనే అంగన్‌ వాడీల్లో కూడా నాడు-నేడు కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీ స్కూళ్లన్నీ ప్రీ ప్రైమరీ స్కూల్స్‌ తరహాలోకి రావాలన్నారు. గురువారం మహిళా శిశు సంక్షేమశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ సూళ్లలో 9 రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని, అంగన్‌ వాడీల్లో కూడా నాడు-నేడు కింద అభివృద్ధి కార్యక్రమాలు, సదుపాయాలు కల్పించాలన్నారు. 'అంగన్‌ వాడీల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండాలి. ఫర్నీచర్‌, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, ఫ్రిజ్‌, పరిశుభ్రమైన తాగు నీరు, మరుగుదొడ్లు, రంగులు, బ్లాక్‌ బోర్డు, ప్రహరీ సహా కావాల్సిన మరమ్మతులు చేసి సదుపాయాలు కల్పించాలి' అన్నారు. అంగన్‌ వాడీల్లో గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ఇచ్చే ఆహారం నాణ్యంగా ఉండాలన్నారు. మంచి పౌష్టికాహారాన్ని తల్లులకు అందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో తల్లులు, పిల్లలకు పౌష్ఠికాహారంపై రూ.740 కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రభుత్వం 2019-2020లో రూ.1,100 కోట్లు ఖర్చు చేసిందని సీఎం చెప్పారు. దీన్ని మరింత పెంచి ఈ ఏడాది రూ.1,862 కోట్లకుపైగా ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బకాయిలు లేకుండా గ్రీన్‌ చానల్‌లో చెల్లింపులు జరిగేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. మంత్రి తానేటి వనిత, సీఎస్‌ నీలం సాహ్ని తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories