ఆ ఇద్దరు అధికారుల కోసం సీఎం జగన్ ముమ్మర ప్రయత్నాలు

ఆ ఇద్దరు అధికారుల కోసం సీఎం జగన్ ముమ్మర ప్రయత్నాలు
x
Highlights

ఆ ఇద్దరు అధికారుల కోసం ముఖ్యమంత్రి చేయని ప్రయత్నాలు లేవు. పొరుగు రాష్ట్ర సీఎంను ఒప్పించారు.. ఢిల్లీలోనూ సంప్రదింపులు జరిపారు. అయితే ఈ ప్రయత్నాలు...

ఆ ఇద్దరు అధికారుల కోసం ముఖ్యమంత్రి చేయని ప్రయత్నాలు లేవు. పొరుగు రాష్ట్ర సీఎంను ఒప్పించారు.. ఢిల్లీలోనూ సంప్రదింపులు జరిపారు. అయితే ఈ ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. అయినప్పటికీ ఆ అధికారుల విషయంలో వెనక్కు తగ్గేది లేదని, ఎన్ని ప్రయత్నాలు చేయడానికైనా సిద్ధమంటున్నారు సీఎం. ఇంతకూ ఎవరా అధికారులు..? ఏమా కథ..?

ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన సమయం నుండి తెలంగాణ సర్వీసులో ఉన్న ఒక ఐఏఎస్.. మరో ఐపిఎస్ అధికారిని తన ప్రభుత్వంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఇందు కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ తో స్వయంగా చర్చించి ఒప్పించి వారిని రిలీవ్ చేయించారు. కానీ, అంతరాష్ట్ర సర్వీసు డిప్యుటేషన్ కు కేంద్రం ఆమోదం పడలేదు. అయితే ఇప్పుడు సీఎం జగన్ తిరిగి ఆ ఇద్దరు అధికారుల కోసం మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరు అధికారుల్లో ఒకరు ఐఏఎస్ అధికారిణి జగన్ అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించిన శ్రీలక్ష్మి కాగా మరొకరు ఐపిఎస్ అధికారి వైయస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర సెక్యూరిటీ అధికారిగా పని చేసిన సీనియర్ ఐపిఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర.

మరోవైపు సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే శ్రీలక్ష్మిని సీఎంఓలోకి తీసుకోవాలని కీలకమైన ఇంటలిజెన్స్ చీఫ్ గా స్టీఫెన్ రవీంద్రను నియమించాలని జగన్ భావించారు. అందుకోసం స్టీఫెన్ రవీంద్ర కొద్ది రోజులు అమరావతి చుట్టూ చక్కర్లు కొట్టారు. అనధికారికంగా నిఘా వ్యవహారాలను పర్యవేక్షించినట్లు కూడా ప్రచారం సాగింది. స్టీఫెన్ పైన జగన్ కు భారీ అంచనాలు ఉన్నాయి. ఆయన సమర్ధత మీద నమ్మకం ఉంది. దీంతో కీలకమైన నిఘా శాఖను ఆయనకు అప్పగించాలని భావించారు. చివరి వరకు ప్రయత్నించారు. అయితే, నిర్దిష్ఠమైన కారణాలు లేకుండా అంతరాష్ర డిప్యుటేషన్ ఇవ్వటం కుదరదంటూ కేంద్రంలోని డీఓపీటీ కొర్రీ పెట్టింది. దీంతో స్టీఫెన్ ఏపీ రాక నిలిచిపోయింది. తిరిగి తెలంగాణ ప్రభుత్వంలో డ్యూటీ చేరిపోయారు.

ఇక ప్రస్తుతం ఏపీలో రాజకీయంగా మారుతున్న సమీకరణాలపై నిఘా అవసరమన్న అభిప్రాయం ప్రభుత్వ పెద్దలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో కేంద్రంలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి తిరిగి ఆ ఇద్దరు అధికారులను రప్పించాలని సీఎం భావిస్తున్నారు. మరి ఈసారైనా ముఖ్యమంత్రి ప్రయత్నం ఫలిస్తుందా..? ఆ ఇద్దరు అధికారులు ఏపీకి చేరుకుంటారా అన్న అంశం ఆసక్తి కరంగా మారింది.


Show Full Article
Print Article
Next Story
More Stories