Andhra Pradesh: నేటి నుంచి ఏపీలో పెంచిన కొత్త పింఛన్లు

CM Jagan Start New Pension in Guntur | AP News Today
x

నేటి నుంచి ఏపీలో పెంచిన కొత్త పింఛన్లు పంపిణీ

Highlights

Andhra Pradesh: నేటి నుంచి ఏపీలో పెంచిన కొత్త పింఛన్లు పంపిణీ గుంటూరు జిల్లా పెదనందిపాడులో ప్రారంభించనున్న సీఎం జగన్

Andhra Pradesh: వైఎస్సార్‌ పింఛన్‌ కానుక పథకం కింద పెంచిన కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇవాళ గుంటూరు జిల్లా పెదనందిపాడులో సీఎం జగన్‌ ప్రారంభిస్తారు. పింఛనును 2వేల 500కు పెంచిన వివరాలతో కూడిన పోస్టర్లనూ ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇదే సమయంలో జిల్లా స్థాయిల్లో సంబంధిత జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

మరోవైపు వైఎస్సార్‌ పింఛను కానుక పథకం కింద వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, హెచ్‌ఐవీ బాధితులకు ఇచ్చే పింఛన్ల మొత్తాన్ని 2వేల 250 నుంచి 2వేల 500కి పెంచుతూ పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. అదనంగా 250రూపాయలు పెంచడం వల్ల ప్రభుత్వంపై 129 కోట్ల భారం పడనుంది. ఇక కొత్తగా 1.41 లక్షల మందికి పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories