CM Jagan: ఐటీ పాలసీపై ఏపీ సీఎం జగన్ సమీక్ష

CM Jagan Review Meeting on IT Policy
x
ఐటీ పాలసీపై సీఎం జగన్ సమీక్ష (ఫైల్ ఇమేజ్)
Highlights

CM Jagan: ఐటీ పాలసీపై అధికారులతో సమీక్షిచిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు

CM Jagan: ఐటీ పాలసీపై అధికారులతో సమీక్షిచిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖకు బెస్ట్ ఐటీ యూనివర్సిటీ తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, తిరుపతి, అనంతపురం పట్టణాల్లో కాన్సెప్ట్‌ సిటీలు ఏర్పాటు చేయాలన్నారు. వీటితోపాటు గ్రామాల్లో డిజిటల్ లైబ్రెరీల ఏర్పాటుపైనా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్స్‌, డిజిటల్‌ లైబ్రరీల ఏర్పాటుపై సీఎం జగన్ అధికారులతో చర్చించారు. మంచి ఉద్యోగాలు రావడమే ఐటీ పాలసీ ప్రధాన ఉద్దేశమని, హైఎండ్‌ స్కిల్స్‌ నేర్పించే కంపెనీలకు పాలసీలో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామాలకు మంచి సామర్థ్యం ఉన్న ఇంటర్నెట్‌ను తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి గ్రామ పంచాయతీలో డిజిటల్‌ లైబ్రరీల ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. డిసెంబర్‌లోపు సుమారు 4వేల గ్రామాలకు ఇంటర్నెట్‌ కనెక్టివిటీ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.

మరోవైపు.. ఐటీ రంగంలో బెస్ట్ యూనివర్శిటీని వైజాగ్‌కు తీసుకురావాలని, అత్యాధునిక టెక్నాలజీ లెర్నింగ్‌కు ఈ వర్శిటీ డెస్టినేషన్‌ పాయింట్‌గా మారాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భవిష్యత్‌లో స్టీల్ సిటీ ఐటీకి ప్రధాన కేంద్రంగా మారనుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తిరుపతి, అనంతపురం పట్టణాలలో కాన్సెప్ట్‌ సిటీలు ఏర్పాటు చేయాలని, అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసి, అవసరమైన భూములను గుర్తించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఇక.. రాష్ట్రంలో ఏర్పాటయ్యే కంపెనీలకు ప్రతి ఏడాది ఇన్సెంటివ్‌లు చెల్లిస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కాన్సెప్ట్‌ను బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అటు.. కడప జిల్లా కొప్పర్తిలో నిర్మిస్తున్న వైఎస్సార్ ఈఎంసీ ప్రగతిపై సీఎంకు వివరాలు అందించిన అధికారులు.. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories