CM Jagan Review Meeting on Irrigation Project: ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై సీఎం జగన్‌ సమీక్ష

CM Jagan Review Meeting on Irrigation Project: ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై సీఎం జగన్‌ సమీక్ష
x
YS Jagan (File Photo)
Highlights

CM Jagan Review Meeting on Irrigation Project: విజయనగరం జిల్లాల్లోని ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు.

CM Jagan Review Meeting on Irrigation Project: విజయనగరం జిల్లాల్లోని ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్న అవుకు టన్నెల్‌-2, పూల సుబ్బయ్య వెలిగొండ టన్నెల్‌-1, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, వంశధార-నాగావళి అనుసంధానం, వంశధార ప్రాజెక్ట్‌-2లో ఫేజ్‌-2 పనులను వేగ‌వంతం చేయాల‌ని అన్నారు. బుధ‌వారం ఇరిగేష‌న్ ప్రాజెక్టు నిర్మాణ ప్రగతిపై సీఎం జగన్‌ సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.

ఈ క్ర‌మంలో ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నిర్మాణంపై కరోనా ప్రభావం చూపిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పుడు ప్రాజెక్టు పనులు వేగం పుంజుకుంటున్నాయని వివరణ ఇచ్చారు. వరద సమయంలోనూ పోలవరం పనులు చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. అక్టోబరు నాటికి అవుకు టన్నెల్‌-2 పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. అక్టోబరు నాటికి అవుకు టన్నెల్‌–2 పూర్తి చేస్తున్నామన్న అధికారులు ఇటీవల వర్షాలకు సొరంగ మార్గంలో మట్టి జారిందని, దాన్ని అరికట్టడానికి నిపుణుల కమిటీని ఏర్పాటచేసి వారి సూచనల మేరకు తగిన చర్యలు చేపడతామన్న అధికారులు అనుకున్న ప్రకారం అక్టోబరు నాటికి అదనంగా మరో 10వేల క్యూసెక్కుల నీరు వెళ్లే అవకాశం ఉంటుందన్న అధికారులు తెలిపారు.

తోటపల్లిలో మిగిలిపోయిన పనులు సహా వివిధ ప్రాజెక్టులకు రూ.500 కోట్లు ఖర్చుపెడితే ఇక్కడ అన్ని ప్రాజెక్టులూ పూర్తవుతాయన్నారు. నెలకు కొంత మొత్తాన్ని కేటాయించుకుంటూ పోతే ఇవన్నీ కూడా పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తాయని సీఎం తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టుకు టన్నెల్‌-2ను వేగంగా పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. నెల్లూరు బ్యారేజీలో సివిల్‌ పనులు దాదాపు పూర్తికావచ్చాయని అధికారులు వివరించారు. సంగం బ్యారేజీకూడా నవంబర్‌ నాటికి పూర్తిచేస్తామన్న అధికారులు తెలిపారు.

వంశధార ప్రాజెక్టు రెండో ఫేజ్‌–2, స్టేజ్‌–2 పనుల ప్రగతిపై సీఎం ఆరా తీశారు. అలాగే వంశధార – నాగావళి లింకు పనులు డిసెంబరు చివరి నాటికి పూర్తిచేస్తామన్నారు. నేరడి ప్రాజెక్టు నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఒడిశా సీఎంతో చర్చల కోసం సీఎం జగన్‌ లేఖ రాసిన అంశాన్ని గుర్తు చేశారు. దీని రిప్లై కోసం వేచి చూడకుండా, వారితో మాట్లాడి ఒడిశా సీఎంతో చర్చలకు ఖరారు చేయాలన్నారు. అలాగే జంఝావతి ప్రాజెక్టుకు సంబంధించి ఒడిశాతో ఉన్న సమస్యల పరిష్కారానికి దృష్టి పెట్టాలని సీఎం జగన్‌ ​అధికారులకు సూచించారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రగతిని సీఎం వైఎస్‌ జగన్‌కు అధికారులు వివరించారు. కోవిడ్‌ సమయంలో కూడా పనులు కొనసాగించామని తెలిపారు. పోలవరం స్పిల్‌వే పిల్లర్స్‌ ఈ ప్రభుత్వం వచ్చేనాటికి సగటు ఎత్తు 28 మీటర్లు కాగా, ఇప్పుడు 51 మీటర్లుగా ఉందని తెలిపారు. సెప్టెంబరు 15కల్లా స్పిల్‌వే పిల్లర్స్‌ పనులు పూర్తవుతాయని అధికారులు సీఎంకు చెప్పారు. వర్షాకాలంలో కూడా పనులు చేసేందుకు ప్రణాళికలు వేసుకున్నామని సీఎం దృష్టికి తీసుకువచ్చారు.

అలాగే ఎడమ కాల్వ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. పోలవరం సహాయ పునరావాస పనులపైనా సమీక్షించిన సీఎం వైఎస్‌ జగన్‌.. పునరావాస కార్యక్రమాల్లో నాణ్యతపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. గండికోటలో 26.85 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు వీలుగా అవసరమైన ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈసారి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నింపాలని అధికారులకు సూచించారు. చిత్రావతిలో 10 టీఎంసీల నీటిని కూడా నిల్వచేయాలని అధికారులకు తెలిపారు. గండికోట– పైడిపాలెం లిఫ్ట్‌ అప్‌గ్రెడేషన్‌ పనులు కూడా త్వరగా మొదలుపెట్టాలని సీఎం ఆదేశం. రాజోలి, జోలదిరాశి ప్రాజెక్టులు పనులు త్వరితగతిన మొదలుపెట్టాలని సీఎం ఆదేశం

Show Full Article
Print Article
Next Story
More Stories