సీఎం జగన్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ

CM Jagan Review Meeting | AP News
x

సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ

Highlights

CM Jagan: మంత్రివర్గ విస్తరణ తర్వాత రెండోసారి భేటీ

CM Jagan: సీఎం జగన్ అధ్యక్షతన ఇవాళ క్యాబినెట్ సమావేశం జరగనున్నది. రాష్ట్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థికరణ జరిగిన తర్వాత రెండో సారి కేబినెట్ భేటీ కాబోతోంది. రాష్ట్రపతి అభ్యర్ధి నామినేషన్ సందర్భంగా ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు మద్దతుగా సీఎం జగన్ హస్తిన బయల్దేరేందుకు సిద్ధం అయ్యారు. అయినప్పటికీ చివరి నిమిషంలో జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకున్నారు. దీంతో క్యాబినెట్ సమావేశం యథావిధిగా కొనసాగుతుందని మంత్రులు సమాచారం అందించారు.

అమ్మఒడికి అమోదం తెలపనున్నారు. ప్రతి ఏడాది విద్యా సంవత్సరం ఆరంభంలోనే అమ్మఒడి తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ఇటీవ సీఎం జగన్ ధావోస్ వేదికగా చేసుకున్న ఒప్పందాల అమలులో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు భూముల కేటాయింపు, గ్రీన్ ఎనర్జీ సంస్థలకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది.

ఇటీవల జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. త్వరలో ఆదానీ గ్రూపు ఏపీలో ప్రారంబించనున్న ఆధాని గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు క్యాబీనెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అదే విధంగా రాష్ట్రంలో పలు చోట్ల త్వరలోనే గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఆమోదం పొందే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories