వారందరికి నూటికి నూరు శాతం ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిందే: సీఎం జగన్‌

వారందరికి నూటికి నూరు శాతం ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిందే: సీఎం జగన్‌
x
Highlights

రాష్ట్రంలో అర్హులైన పేదలకు నూటికి నూరుశాతం ఇళ్లపట్టాలు పంపిణీ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో జిల్లాల వారీగా...

రాష్ట్రంలో అర్హులైన పేదలకు నూటికి నూరుశాతం ఇళ్లపట్టాలు పంపిణీ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో జిల్లాల వారీగా ఇళ్లపట్టాలపై పరిస్థితిని సమీక్షించారు. ఈ సమావేశానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో పేదలకు ఇళ్ళపట్టాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని జూలై 8న సీఎం ప్రారంభించనున్నారు.

29–30 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నామని.. ఇది అత్యంత ప్రాధాన్యతతో కూడిన కార్యక్రమం అని సీఎం జగన్ అన్నారు. భూసేకరణ, పొజిషన్, ప్లాట్ల అభివృద్ధి మీద నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను సూచించారు. ప్లాట్ల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ వెంటనే పూర్తి కావాలని అన్నారు. ఇళ్ల పట్టాల లబ్ధిదారుల తుది జాబితా గ్రామ సచివాలయాల్లో పెట్టాలని ఆదేశించారు. పారదర్శకంగా, ప్రభావవంతంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. సరైన కారణం లేకుండా ఎవరికైనా ఇంటి పట్టా రాలేదంటే అధికారులను బాధ్యులను చేస్తానని హెచ్చరించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటిపట్టా ఇవ్వాలన్నారు. తనకు ఓటు వేయని వారికి కూడా అర్హులైతే ఇళ్ల పట్టా ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories