AP News: లండన్‌ నుంచి రాష్ట్రానికి రానున్న సీఎం జగన్

CM Jagan Returning from London Today
x

AP News: లండన్‌ నుంచి రాష్ట్రానికి రానున్న సీఎం జగన్

Highlights

Jagan: ఎన్నికల తర్వాత వెకేషన్ వెళ్లిన సీఎం జగన్ ఈరోజు రాత్రికి రాష్ట్రానికి చేరుకోనున్నారు.

Jagan: ఎన్నికల తర్వాత వెకేషన్ వెళ్లిన సీఎం జగన్ ఈరోజు రాత్రికి రాష్ట్రానికి చేరుకోనున్నారు. ఇప్పటికే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు... నిన్న సీఎం జగన్ సైతం ట్విట్టర్ వేదికగా స్పందించారు. తిరిగి మళ్లీ అధికారం చేపట్టబోతున్నామంటూ... 2019 నాటి ప్రమాణ స్వీకారం ఫొటోను షేర్ చేశారు. దీంతో వివిధ ప్రాంతాల్లో విశ్రాంతి తీసుకుంటున్న ఎమ్మెల్యేలు తిరుగుప్రయాణం అయ్యారు. రేపు సాయంత్రానికి ఏపీ చేరుకోనున్నారు. అయితే.. ఇప్పటిదాకా విశ్రాంతి తీసుకున్న నేతల్లో మళ్లీ టెన్షన్ మొదలైంది. బయటికి ధీమా వ్యక్తం చేస్తున్నా.. లోలోపల మాత్రం ఆందోళన పడుతున్నట్టు తెలుస్తుంది.

ఎన్నికలు ముగిసిన తర్వాత రోజు కూడా ఐప్యాక్ టీంతో ఈసారి గెలుపు తమదేనని ప్రకటించారు. దేశం నివ్వేరపోయే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ నిన్న ట్విట్టర్ వేదికగా స్పందించడంతో.. వైసీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories