CM Jagan: ఏపీలో వరద సహాయక చర్యలపై సీఎం జగన్‌ ఆదేశాలు

CM Jagan Orders on Floods Relief Operations in Andhra Pradesh
x

సీఎం జగన్ (ఫైల్ ఇమేజ్)

Highlights

CM Jagan: ఇంఛార్జ్ మంత్రులు, జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు సహాయక కార్యక్రమాలు పర్యవేక్షించాలని ఆదేశం

CM Jagan: ఏపీలో వరద సహాయక చర్యలపై సీఎం జగన్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇంఛార్జ్ మంత్రులు, జిల్లాల మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు సహాయక కార్యక్రమాలు పర్యవేక్షించాలని ఆదేశించారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ బాధితులకు అండగా నిలవాన్నారు. అలాగే అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. రేషన్ పంపిణీ, పంట నష్టంపై అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదని, తమ ప్రాంతాల్లోనే ఉండి సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు.

మరోవైపు వర్షాలు, వరదలతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు తక్షణం నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, లీటర్ వంటనూనెతో పాటు.. కిలో ఉల్లిపాయలు, బంగాళ దుంపలు కిలో చొప్పున ఇవ్వాలని ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories