CM Jagan: నవంబర్ నుంచి ధాన్యం కొనుగోళ్లకు సీఎం జగన్ ఆదేశం

CM Jagan Ordered to Purchase Crops from November
x

CM Jagan: నవంబర్ నుంచి ధాన్యం కొనుగోళ్లకు సీఎం జగన్ ఆదేశం

Highlights

CM Jagan: ఈ నెల17న రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల

CM Jagan: నవంబర్ మొదటి వారం నుంచి రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రైతులకు మద్దతు ధర వచ్చేలా అన్ని రకాలు చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు ఇతర అంశాలపై పౌరసరఫరాల శాఖ, ఇతర ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులను అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రబీ సాగుకోసం అన్నిరకాలుగా సన్నద్ధమైనట్లు తెలిపారు. అనంతరం ఈక్రాపింగ్‌ తీరుపై ఆరా తీసిన జగన్.. ఈనె 15లోగా రైతుల అథంటికేషన్‌ పూర్తిచేసి, డిజిటల్‌, ఫిజికల్‌ రశీదులు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే ఈ నెల 17న రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా రెండో విడత నిధలుు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వరి విస్తారంగా సాగవుతున్నందున బియ్యం ఎగుమతులపైనా దృష్టిపెట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. పండించిన పంటలకు కనీస మద్దతు ధర అందేలా చూడాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories