Andhra Pradesh: శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్ * ఉ.10 గంటలకు జీరో పాయింట్ దగ్గర సీఎం జగన్ పైలాన్ ఆవిష్కరణ
Andhra Pradesh: కృష్ణానది కరకట్ట విస్తరణ పనులకు ఇవాళ సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10:25 గంటల ప్రాంతంలో సీఎం పనులకు శ్రీకారం చుడతారు. ప్రకాశం బ్యారేజి వద్ద నున్న కొండవీటి వరద ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకు కుడివైపు కృష్ణా కరకట్ట రోడ్డును విస్తరించనున్నారు.
మొత్తంగా 15.525 కిలో మీటర్లమీ పొడవునా రోడ్డును విస్తరిస్తారు. మొత్తంగా 10 మీటర్ల వెడల్పుతో రెండు వరుసలు వాహనాలు వెళ్లడానికి, మరో రెండు వరుసలు ఇరువైపులా నడకదారులను నిర్మిస్తున్నారు. ఈ రహదారిలో కొండవీటి వాగు బ్రిడ్జిని పునర్‌నిర్మించడం, వెంకటాయపాలెం, రాయపూడి అవుట్‌ఫాల్ స్లూయిస్, వరద పర్యవేక్షణ కేంద్రాలను నిర్మిస్తారు.
ఈ రహదారితో అమరావతిలోని ఎన్ 1 నుంచి ఎన్ 3 రోడ్డులను ఉండవల్లి – రాయపూడి – అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్, గొల్లపూడి – చిన్నకాకాని – విజయవాడ బైపాస్ రోడ్లకు అనుసంధానిస్తారు. అమరావతి, సచివాలయం, హైకోర్టు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్ధలకు, ఉండవల్లి, పెనుమాక, వెంకటపాలెం, మందడం, ఉద్దండరాయునిపాలెం, రాయపూడి, బోరుపాలెం, అబ్బురాజుపాలెం, అమరావతి మండలం హరిశ్చంద్రాపురం, వైకుంఠపురం గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire