వైఎస్ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం ప్రారంభం

వైఎస్ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం ప్రారంభం
x
Highlights

వైఎస్ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని సీఎం జగన్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. పంట రుణాలపై రైతులకు వడ్డీ రాయితీ చెల్లించారు. అక్టోబర్‌లో దెబ్బతిన్న...

వైఎస్ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని సీఎం జగన్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. పంట రుణాలపై రైతులకు వడ్డీ రాయితీ చెల్లించారు. అక్టోబర్‌లో దెబ్బతిన్న పంటలకు కూడా పెట్టుబడి రాయితీ విడుదల చేశారు. రైతులకు ఎంత చేసినా తక్కువేనన్న సీఎం జగన్ 18 నెలల్లోనే 90 శాతానికిపైగా హామీలు నెరవేర్చామన్నారు. పంట రుణాలపై రైతులకు వడ్డీ రాయితీ పూర్తిగా చెల్లిస్తున్నామన్న ఆయన ఏ సీజన్‌లో పంట నష్టపోతే అదే సీజన్‌లో రైతులను ఆదుకుంటున్నామన్నారు.

రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తున్నాం. పగటిపూటి ఉచితంగా 9 గంటల విద్యుత్‌ ఇస్తున్నాం. రైతులకు బీమా కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. 147 ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నాం. పంటల కొనుగోలుకు 3,200 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. ఈ నెల 26న ప్రకాశం, చిత్తూరు, వైఎస్‌ఆర్‌ జిల్లాలో మొదటి విడత పాలసేకరణలో భాగంగా బల్క్‌ మిల్క్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం అని సీఎం జగన్‌ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories