జియో టవర్లను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్‌

Cm Jagan Launches Jio 5g Towers In Andhra Pradesh
x

జియో టవర్లను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్‌

Highlights

JIO: కొత్త ప్రారంభించిన సెల్ టవర్లతో..

Cm Jagan: ఏపీలో మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలు, 100 జియో టవర్లను ఒకేసారి సీఎం జగన్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. దీని ద్వారా 209 మారుమూల గ్రామాలకు సేవలు అందనున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 85 టవర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 10 టవర్లు, అన్నమయ్య జిల్లాలో 3 టవర్లు, కడప జిల్లాలో 2 టవర్లను సీఎం ప్రారంభించారు. రిలయన్స్‌ జియో సంస్థ ఈ టవర్లను ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో 5జీ సేవలను అప్‌గ్రేడ్‌ చేయనుంది. కొత్తగా ప్రారంభించిన సెల్‌టవర్ల వల్ల మారుమూల ప్రాంతాలనుంచి ఆయా జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ప్రజలు నేరుగా ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లోని గిరిజనులతో సీఎం జగన్‌ ఇంటరాక్ట్‌ అయ్యారు. ఈ ప్రాజెక్టు కింద కొత్తగా 2వేల 704 ప్రాంతాల్లో టవర్లను ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం ఇప్పటికే 2వేల 363 చోట్ల స్థలాలు ప్రభుత్వం అప్పగించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories