'వైఎస్సార్‌ కాపు నేస్తం' ప్రారంభించిన సీఎం జగన్‌

వైఎస్సార్‌ కాపు నేస్తం ప్రారంభించిన సీఎం జగన్‌
x
Highlights

మహిళల కోసం జగన్ సర్కార్ మరో పథకం తీసుకొచ్చింది. 'వైఎస్సార్‌ కాపు నేస్తం' అనే పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈ పథకాన్ని తాడేపల్లిలోని క్యాంపు...

మహిళల కోసం జగన్ సర్కార్ మరో పథకం తీసుకొచ్చింది. 'వైఎస్సార్‌ కాపు నేస్తం' అనే పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈ పథకాన్ని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. 13 నెలల పాలనలో ఎక్కడా వివక్షకు తావు ఇవ్వలేదు. రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాము. అర్హులైన కాపు మహిళలకు ఏటా రూ.15వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తాం. తొలి ఏడాదిలో రూ. 354 కోట్ల ఖర్చుతో దాదాపు 2.36లక్షల మంది కాపు మహిళలకు లబ్ధి కలగనుంది. అర్హులందరికీ న్యాయం చేయాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం'' అన్నారు.

ఈ పథకం ద్వారా అర్హులైన కాపు మహిళలకు ఏడాదికి 15వేల రూపాయల చొప్పున 5 ఏళ్లలో మొత్తం 75 వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తారు. ఈ ఏడాది లబ్ధిదారులకు నేరుగా వారి వారి ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేస్తారు. ఈ పథకం ద్వారా తొలి ఏడాది దాదాపు 2,35,873 మంది మహిళలకు లబ్దిచేకురనుంది. ఈ పథకం 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు వర్తిస్తుంది. సుమారు రూ.354 కోట్ల ఆర్థిక సాయం అందనుంది. నేరుగా వారి ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమచేస్తారు. గ్రామ, వార్డు వలంటీర్ల వ్యక్తిగత తనిఖీలు, గ్రామ సచివాలయాల్లో అర్హులైన లబ్ధిదారుల జాబితాల ప్రదర్శన, అభ్యంతరాల స్వీకరిస్తారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories