CM Jagan: కృష్ణానది కరకట్ట పనులకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్‌

CM Jagan Laid the Foundation Stone for the Krishna River Dam
x

శంకు స్థాపన చేసిన సీఎం జగన్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

CM Jagan: ప్రకాశం బ్యారేజీ నుంచి రాయపూడి వరకు 15.525 కి.మీ. మేర విస్తరణ

CM Jagan: కృష్ణానది కరకట్ట విస్తరణ పనులకు ఇవాళ సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. ప్రకాశం బ్యారేజి వద్దనున్న కొండవీటి వరద ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకు 15.525 కి.మీ. మేర కుడివైపు కృష్ణా నది కరకట్ట పనులకు జగన్‌ శంకుస్థాపన చేశారు. కరకట్ట విస్తరణ పనుల కోసం ఏపీ ప్రభుత్వం రూ. 150 కోట్లు ఖర్చు చేయనుంది. అమరావతి స్మార్ట్‌ అండ్‌ సస్టెయినబుల్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నిధులతో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో విస్తరణ పనులు జరగనున్నాయి. 10 మీటర్ల వెడల్పుతో రెండు వరుసల రహదారితో పాటు ఇరువైపులా రెండు వరుసల నడకదారులను నిర్మించనున్నారు.

ఈ రహదారితో అమరావతిలోని ఎన్‌-1 నుంచి ఎన్‌-3 రోడ్లను అలాగే ఉండవల్లి- రాయపూడి- అమరావతి సీడ్‌ యాక్సిస్‌ రోడ్, గొల్లపూడి- చిన్నకాకాని- విజయవాడ బైపాస్‌ రోడ్లకు అనుసంధానమవుతుంది. కరకట్ట రహదారి నిర్మాణం ద్వారా అమరావతి, సచివాలయం, హైకోర్టు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్ధలు, తాడేపల్లి మండలంలోని ఉండవల్లి, పెనుమాక, తుళ్ళూరు మండలం వెంకటపాలెం, మందడం, ఉద్దండరాయునిపాలెం, రాయపూడి, బోరుపాలెం, అబ్బురాజుపాలెం, అమరావతి మండలం హరిశ్చంద్రాపురం, వైకుంఠపురం గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడునుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories