Amarnath: జమీలి ఎన్నికలపై సీఎం జగన్‌దే తుది నిర్ణయం

CM Jagan Is The Final Decision On Jamili Elections Says Amarnath
x

Amarnath: జమీలి ఎన్నికలపై సీఎం జగన్‌దే తుది నిర్ణయం

Highlights

Amarnath: రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా ఆరు, ఏడు నెలల సమయం ఉంది

Amarnath: విశాఖలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయన్నిప్రారంభించారు మంత్రి అమర్నాథ్. ఎండాడ లా కాలేజీలో రోడ్‌లో నూతన కార్యాలయం నిర్మించారు. ప్రస్తుతం ఈ కార్యాలయం విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంగా సేవలందిస్తుంది. సీఎం వి‎శాఖ వచ్చాక రాష్ట్ర పార్టీ కార్యాలయంగా వినియోగిస్తామన్నారు. అవసరమైతే మరో ఆఫీసు నిర్మిస్తామన్నారు. ఈ సందర్భంగానే జమిలి ఎన్నికలపై స్పందించారు మంత్రి అమర్నాథ్. రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా ఆరు, ఏడు నెలల సమయం ఉందన్నారు. ఎన్నికలు రెండు, మూడు నెలల ముందు వచ్చినా ఇబ్బందేం లేదన్నారు. ఈ అంశంపై సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారన్నారు మంత్రి అమర్నాథ్.

Show Full Article
Print Article
Next Story
More Stories