cm jagan government praised : కరోనా కట్టడికి జగన్ సర్కార్ చర్యలు భేష్ యూకే డిప్యూటీ హైకమిషనర్ ప్రశంసలు!

cm jagan government praised : కరోనా కట్టడికి జగన్ సర్కార్ చర్యలు భేష్ యూకే డిప్యూటీ హైకమిషనర్ ప్రశంసలు!
x
Highlights

cm jagan government praised :కరోనా వైరస్ కట్టడి జగన్ సర్కారు తీసుకుంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయంటూ.. హైదరాబాదులో యూకే డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ అభినందించారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని చూసి ప్రపంచమే పాఠాలు నేర్చుకోవాలంటూ ఫ్లెమింగ్ ట్వీట్ చేశారు

CM Jagan government praised: కరోనా వైరస్ కట్టడి జగన్ సర్కారు తీసుకుంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయంటూ.. హైదరాబాదులో యూకే డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ అభినందించారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని చూసి ప్రపంచమే పాఠాలు నేర్చుకోవాలంటూ ఫ్లెమింగ్ ట్వీట్ చేశారు. కరోనా మహమ్మారి ఏపీ కట్టడి ప్రభుత్వం కోసం కృషి చేస్తున్న తీరును ప్రస్తుతిస్తూ ఓ జాతీయ ఛానెల్ లో కథనం రాగా, ఆ కథనం లింకును కూడా ఫ్లెమింగ్ ట్విట్టర్ లో పంచుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు ప్రతి 10 లక్షల మందిలో 14,049 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారని, 4.5 లక్షల మందితో కూడిన బలమైన వలంటీర్ల వ్యవస్థ 11,158 మంది గ్రామ కార్యదర్శులు, క్వారంటైన్ చర్యల పర్యవేక్షణకు.. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్న వైనం అమోఘం అని కొనియాడారు.

ఏపీలో ఇవాళ 605 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. గడచిన 24 గంటల్లో 22,305 మంది నమూనాలు పరీక్షింనట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన 35 కేసులు ఉండగా.. రాష్ట్రంలో 570 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 11,489 కేసులు నమోదయ్యాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories