CM Jagan gives green signal to Medical Posts: ఏడు రోజుల్లో మెడికల్ పోస్టులు భర్తీ చేసుకోవాలి.. కలెక్టర్లను ఆదేశించిన ఏపీ సీఎం జగన్

CM Jagan gives green signal to Medical Posts: ఏడు రోజుల్లో మెడికల్ పోస్టులు భర్తీ చేసుకోవాలి.. కలెక్టర్లను ఆదేశించిన ఏపీ సీఎం జగన్
x
CM Jagan gives green signal to replacement medical posts
Highlights

CM Jagan gives green signal to Medical Posts: అసలే కరోనా తీవ్రంగా వ్యాపిస్తోంది... దీనిని కట్టడి చేయాలంటే దానికి అనుగుణంగా వసతులతో పాటు వైద్యులు, ఇతర సిబ్బంది కావాల్సిన అవసరం ఉంది

CM Jagan gives green signal to Medical Posts: అసలే కరోనా తీవ్రంగా వ్యాపిస్తోంది... దీనిని కట్టడి చేయాలంటే దానికి అనుగుణంగా వసతులతో పాటు వైద్యులు, ఇతర సిబ్బంది కావాల్సిన అవసరం ఉంది.ఇప్పటికే వసతులు పెంపుపై ఏర్పాట్లు చేసిన ఏపీ ప్రభుత్వం తాజాగా ఖాళీగా ఉన్న వైద్యులు, ఇతర సిబ్బందిని తాత్కాలిక పద్ధతిపై నియమించేందుకు నిర్ణయించింది. రాష్ట్రంలో 26,778ల పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఎన్నడూలేని విధంగా ఇన్ని వేల పోస్టులను భర్తీ చేయడం రాష్ట్రంలోనే తొలిసారని పలువురు అంటున్నారు.

కరోనా నియంత్రణ దిశగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. వారం రోజుల్లోగా మొత్తం 26,778 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. దేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో ఇంత పెద్ద స్థాయిలో నియామ కాలు చేపట్టడం ఇదే తొలిసారి. ఈ పోస్టులన్నింటినీ ఆగస్టు 5లోగా భర్తీ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. వీళ్లందరినీ జూలై 30 నుంచి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ద్వారా నియమించుకోవాలని సూచించింది.

► మెడికల్‌ ఆఫీసర్లు, స్పెషలిస్టు డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు, టెక్నీషియన్లు ఇలా మొత్తం 26,778 మందిని నియమిస్తున్నారు. ఆరు నెలల కాలానికి తాత్కాలిక ప్రాతిపదికన వీరిని నియమిస్తారు.

► నియామకం పూర్తయిన రోజే విధుల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

► ఆగస్టు 6 మధ్యాహ్నం 12 గంటల కల్లా కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌కు ఎంపికైనవారి వివరాలు పంపాలి.

కోవిడ్‌ ఆస్పత్రుల్లో పోస్టింగులు

► స్పెషలిస్టు వైద్యుల నియామ కాల్లో పల్మనాలజీ, అనస్థీషి యా, జనరల్‌ మెడిసిన్‌ వైద్యు లకు ప్రాధాన్యం. వీళ్లు అందు బాటులో లేకపోతే ఇతరులను నియమించుకోవచ్చు.

► ట్రైనీ నర్సుల్లో ఎంఎస్సీ నర్సిం గ్‌/బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎం చేసిన వారు ఉంటారు.

► కొత్తగా నియమితులైన వారికి కరోనా ఆస్పత్రుల్లోనే పోస్టింగ్‌లు

► వేతనాలు చెల్లించేందుకు ప్రత్యేక హెడ్‌ ఆఫ్‌ అకౌంట్‌ ఏర్పాటు

26,778 పోస్టులు కాకుండా ఇప్పటికే ప్రభుత్వం 2,679 పోస్టులను కరోనా వైద్య సేవల కోసం భర్తీ చేసింది. కరోనా వైద్య సేవలతోపాటు, రెగ్యులర్‌ వైద్య సేవల కోసం మరో 9,712 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. వాటి వివరాలు..

వారం రోజుల్లోపే నియామక ప్రక్రియ పూర్తికావాలని చెప్పామని కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్ కాటంనేని భాస్కర్ అన్నారు. అభ్యర్థులకు వేతనాలు ఆశించిన స్థాయిలో ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారన్నారు. అందుకే స్పెష లిస్టు డాక్టర్లకు నెలకు రూ.1,50,000 ఇస్తున్నాం. జిల్లాల్లో నోటిఫికేషన్లు ఇచ్చి కలెక్టర్లు పోస్టులను భర్తీ చేస్తారు. ఎంపికైనవారిని కరోనా వైద్య సేవలకు వినియోగిస్తామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories