CM Jagan Instructions on Bed Allotment: రోగుల కోరిక మేరకు బెడ్ కేటాయించాలి.. కలెక్టరర్లకు సూచించిన సీఎం జగన్

CM Jagan Instructions on Bed Allotment: రోగుల కోరిక మేరకు బెడ్ కేటాయించాలి.. కలెక్టరర్లకు సూచించిన సీఎం జగన్
x
CM JAGAN
Highlights

CM jagan instructions on bed allotment: ఏపీలో కోవిద్ కేసులు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. వీరందరికీ వైద్యం అందించే భాద్యత ప్రభుత్వంపై ఉంది. అవసరమైన వారికి వెంటనే బెడ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి.

CM jagan instructions on bed allotment: ఏపీలో కోవిద్ కేసులు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. వీరందరికీ వైద్యం అందించే భాద్యత ప్రభుత్వంపై ఉంది. అవసరమైన వారికి వెంటనే బెడ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. వారికి వైద్యం అందించడంలో నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు.దీనిపై కలెక్టర్లకు నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్ లో సీఎం జగన్మోహనరెడ్డి ఆదేశించారు.

కరోనాపై అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్‌ వచ్చిందన్న అనుమానం రాగానే ఎక్కడకు వెళ్లాలి? ఎక్కడ పరీక్షలు చేయించుకోవాలి? ఎవరికి కాల్‌ చేయాలన్నదానిపై.. వివరాలు అందరికీ తెలియజేయాలని అన్నారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో కరోనా గురించి పోస్టర్లు ఉంచాలని అధికారులకు సూచించారు. కరోనా నివారణ చర్యలు, జిల్లాల్లో పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

'104, 14410 కాల్‌ సెంటర్‌ నంబర్లు ఇచ్చాం. జిల్లాలో కోవిడ్‌ కంట్రోల్‌ రూం కాల్‌ సెంటర్‌ నంబర్‌ ప్రకటనలు ఇచ్చాం. ఈ మూడు ప్రధాన నంబర్లకు ఎవరైనా కాల్‌ చేసినప్పుడు.. సమర్థవంతంగా పనిచేసేలా చేయాలి. అధికారులు.. కాల్‌ చేసి కాల్‌ సెంటర్ల పనితీరును పర్యవేక్షించాలి. కాల్‌ రాగానే సంబంధిత వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తున్నాయా? లేదా? తనిఖీ చేయాలి. కాల్‌ చేయగానే స్పందించే తీరును కచ్చితంగా పర్యవేక్షించాలి. ఆ నంబర్లు సరిగ్గా పనిచేస్తున్నాయా? లేదా? చెక్‌ చేయాలి. కోవిడ్‌ పాజిటివ్‌ కేసును గుర్తించిన తర్వాత.. హోం క్వారంటైన్, కోవిడ్‌ కేర్‌ సెంటర్‌, జిల్లా కోవిడ్‌ ఆస్పత్రి.. రాష్ట్రస్థాయి కోవిడ్‌ ఆస్పత్రులకు ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా పంపిస్తాం.

హోంక్వారంటైన్‌ కోసం ఇంట్లో వసతులు ఉంటే రిఫర్‌ చేస్తాం. ఇంట్లో ప్రత్యేక గది లేని పక్షంలో వారిని కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కు రిఫర్‌ చేస్తాం. హోంక్వారంటైన్‌లో ఉన్న ఆ వ్యక్తిని పూర్తిగా పర్యవేక్షించాలి. డాక్టరు తప్పనిసరిగా విజిట్‌ చేయాలి. వారికి మందులు అందుతున్నాయా? లేదా? చూడాలి. క్రమం తప్పకుండా.. వారి ఆరోగ్య వివరాలను కాల్‌ చేసి కనుక్కోవాలి కోవిడ్‌ కేర్‌ సెంటర్లో డాక్టర్లను అందుబాటులో ఉంచాలి. పారిశుద్ధ్యం, ఆహారంపై తప్పకుండా ధ్యాస పెట్టాలి. నాణ్యమైన మందులు ఇస్తున్నారా? లేదా? చూడాలి' అని సీఎం పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories