NTR Bharosa: సీఎం చంద్రబాబు చేతుల మీదుగా తొలి పెన్షన్..

Chandrababu, NTR Bharosa Pension Scheme, AP News
x

NTR Bharosa: సీఎం చంద్రబాబు చేతుల మీదుగా తొలి పెన్షన్..

Highlights

NTR Bharosa Pension Scheme: ఎపీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీని సీఎం చంద్రబాబు ప్రారభించారు.

NTR Bharosa Pension Scheme: ఎపీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీని సీఎం చంద్రబాబు ప్రారభించారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాక గ్రామంలో రాములు నాయక్‌ అనే లబ్దిదారులకు పెన్షన్ అందించారు. రాములు నాయక్‌ కూతురుకు పెన్షన్ అందించారు సీఎం చంద్రబాబు. దాదాపు అర గంటపాటు ఆ కుటుంబంతో ముచ్చటించిన సీఎం చంద్రబాబు వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. తమకు ఇళ్లు కావాలని కోరగా.. ఇళ్లు మంజూరు చేస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

మొత్తం 28 విభాగాలకు చెందిన లబ్దిదారులకు పెంచిన పెన్షన్ అందజేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 65.31 లక్షల మందికి పింఛన్ల పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి నెల నుంచే ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టింది. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు పెంచిన పెన్షన్‌ను తొలి నెల నుంచే అమలు చేస్తోంది ఏపీ సర్కార్.

పెన్షన్ పెంచడంతో పాటు గడిచిన మూడు నెలలకు కూడా పెన్షన్ వర్తింపచేసింది ఏపీ ప్రభుత్వం. జులై మాసానిక పెరిగిన పింఛను 4000 కాగా.. ఏప్రిల్, మే, జూన్ నెలలకు వెయ్యి చొప్పున 3000 కలిపి మొత్తంగా 7000 రూపాయలు లబ్దిదారులకు అందించనుంది. వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్య కారులు, కళా కారులు, డప్పు కళాకారులు, ట్రాన్స్ జెండర్స్ వంటి వారికి ఇకపై రూ.4000 పెన్షన్ అందించనుంది.

ఈ నెల నుంచి దివ్యాంగులకు 3 వేల రూపాయలు ఉన్న పెన్షన్ ఒకేసారి 6000 చేసింది కూటమి ప్రభుత్వం. తీవ్ర అనారోగ్యంతో ఉండే వారికి ఇచ్చే పెన్షన్‌ను 5 వేల నుంచి 15 వేలు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఈ విభాగంలో పెన్షణ్ పొందే వారి సంఖ్య 24 వేల 318 మంది ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ పెన్షన్ల పంపిణీ వల్ల ఏపీ ప్రభుత్వంపై నెలకు 819 కోట్ల అదనపు భారం పడనున్నట్టు తెలుస్తుంది.

జులై మాసానికి ఈ పెన్షన్‌ల మొత్తం.. 4, 408 కోట్లు ఖర్చు చేయనుంది. ఇక గడిచిన మూడు నెలలు ఏప్రిల్, మే, జూన్ నెలలకు వెయ్యి చొప్పున ఒక వెయ్యి 650 కోట్లు అదనపు ఖర్చుకానుంది. మొత్తంగా ఈఏడాది 34 వేల కోట్లు ఖర్చు చేయనుంది ఏపీ ప్రభుత్వం.


Show Full Article
Print Article
Next Story
More Stories