Chandrababu: రాజమండ్రి జైలులో చంద్రబాబును విచారిస్తున్న సీఐడీ

CID Interrogating Chandrababu In Rajahmundry Jail
x

Chandrababu: రాజమండ్రి జైలులో చంద్రబాబును విచారిస్తున్న సీఐడీ

Highlights

Chandrababu: ఆక్టోపస్, సివిల్ పోలీస్ బృందాలు మోహరింపు

Chandrababu: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో కుంభకోణానికి పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న చంద్రబాబును సీఐడీ అధికారులు ఇవాళ రెండోరోజు విచారించనున్నారు. సీబీఐ కోర్టు సూచించిన విధంగానే రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారణ చేపట్టబోతున్నారు. తొలిరోజు విచారించినట్లే ఇవాళ కూడా విచారించనున్నారు. మొదటి రోజు దాదాపు 7 గంటల పాటు చంద్రబాబును విచారించిన సీఐడీ అధికారులు.. కీలకాంశాలపై సమాధానాలను రాబట్టే ప్రయత్నం చేశారు.

స్కిల్ స్కాం కేసుకు సంబంధించి ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు. 12 మంది సీఐడీ అధికారుల బృందం.. రెండు టీమ్ లుగా చంద్రబాబును విచారించారు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ను ఎలా నిర్ణయం చేశారు..? సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ పేరుతో జీవో ఎలా ఇచ్చారు..? అగ్రిమెంట్ ఏ విధంగా జరిగింది..? జీవోకు విరుద్ధంగా ఒప్పందం ఉండటం ఏమిటి..? పీఏ పెండ్యాల శ్రీనివాస్‌కు 241 కోట్లు ఎందుకు ఇచ్చారు..? అనే అంశాలపై ప్రశ్నించారు సీఐడీ అధికారులు. చంద్రబాబు ఇచ్చిన సమాధానాల వీడియో, ‎ఆడియో రికార్డు చేశారు.

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉదయం 9 గంటల 30 నిమిషాలకు చంద్రబాబును కస్టడీలోకి తీసుకోనున్నారు. ఉదయం 10 గంటల సమయంలో చంద్రబాబు సీఐడీ విచారణ ప్రారంభించి... మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగనుంది. సాయంత్రం విచారణ ముగిసిన అనంతరం చంద్రబాబును వర్చువల్ గా ఏసీబీ కోర్టు ముందు హాజరుపర్చనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories