AP Fibernet: APSFL ఫైబర్ గ్రిడ్ టెండర్లపై CID కేసు నమోదు

CID Case Filed on APSFL Fiber Grid Tenders
x

 ఏపీ ఫైబర్ నెట్ లోఅవకతవకలు(ట్విట్టర్ ఫోటో ) 

ఫైబర్ గ్రిడ్ టెండర్లపై CID కేసు నమోదు

ఫైబర్ గ్రిడ్ టెండర్లపై CID కేసు నమోదు

Highlights

AP Fibernet: రూ. 321 కోట్లకు అప్పగించిన టెండర్ * టెండర్ లో రూ. 121 కోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తింపు

AP Fibernet: ఏపీ ఫైబర్ నెట్ లో అవకతవకలు జరిగాయని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతం రెడ్డి తెలిపారు. ఫైబర్ గ్రిడ్ లో 333 కోట్ల టెండర్లపై సీఐడీ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. 321 కోట్లకు అప్పగించిన టెండర్లలో 121 కోట్లు అక్రమాలు జరిగాయాన్నారు. బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీకి టెండర్ కట్టబెట్టారన్నారు. ఏడాది సస్పెన్షన్‌ ఉన్నా రెండు నెలల్లోనే టెండర్‌ కట్టబెట్టారన్నారు. టెరా సాఫ్ట్‌కు టెండర్‌ కేటాయించేందుకే కాల పరిమితి పొడిగించారన్నారు.

చంద్రబాబు, వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ కలిసే కుట్రకు పాల్పడ్డారని గౌతమ్‌రెడ్డి మండిపడ్డారు. వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ను టెరా సాఫ్ట్‌లో రాజీనామా చేయించి ఫైబర్‌నెట్‌లో డైరెక్టర్‌గా తీసుకున్నారన్నారు. టెండర్లలో అవకతవకలపై అభ్యంతరాలను కూడా పరిశీలించలేదని గౌతమ్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories